అంతటా సంక్రాంతి శోభ
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:54 PM
జిల్లా అంతటా సంక్రాంతి సందడి నెలకొంది. శనివారం అనకాపల్లి పట్టణంలోని వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మార్కెట్లు రద్దీగా కనిపించాయి.
వస్త్ర దుకాణాలు రద్దీ
మార్కెట్లు కిటకిట
అనకాపల్లి టౌన్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా సంక్రాంతి సందడి నెలకొంది. శనివారం అనకాపల్లి పట్టణంలోని వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మార్కెట్లు రద్దీగా కనిపించాయి. పలు షాపింగ్ మాల్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా అనకాపల్లికి అధిక సంఖ్యలో జనం రావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా చిననాలుగురోడ్ల జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జంక్షన్ వరకు రహదారి కిటకిటలాడింది. ట్రాఫిక్ సీఐ ఎంవీ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.