శభాష్ అమేయ
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:57 AM
మండలంలోని నిండుగొండ గ్రామానికి చెందిన శాస్ర్తీయ నృత్య కళాకారిణి లగుడు అమేయ ‘నేషనల్ యూత్ ఐకాన్’ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ నెల 12వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అవార్డును స్వీకరించనున్నది. ప్రస్తుతం విశాఖలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న లగుడు అమేయ.. నాలుగేళ్ల వయసులోనే కాలిక గజ్జె కట్టి నాట్యంలో అరగేంట్రం చేసింది.
‘నేషనల్ యూత్ ఐకాన్’ అవార్డుకు ఎంపిక
శాస్ర్తీయ నృత్యంలో రాణిస్తున్న బాలిక
2021లో ప్రధానమంత్రి రాష్ర్టీయ బాల పురస్కార్..
రోలుగుంట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నిండుగొండ గ్రామానికి చెందిన శాస్ర్తీయ నృత్య కళాకారిణి లగుడు అమేయ ‘నేషనల్ యూత్ ఐకాన్’ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ నెల 12వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అవార్డును స్వీకరించనున్నది. ప్రస్తుతం విశాఖలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న లగుడు అమేయ.. నాలుగేళ్ల వయసులోనే కాలిక గజ్జె కట్టి నాట్యంలో అరగేంట్రం చేసింది. ఆరేళ్ల వయసులో రెండున్నర గంటపాటు ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి అబ్బురపరిచింది. అనంతరం దేశ, విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. 2021లో ప్రధానమంత్రి రాష్ర్టీయ బాల పురస్కార్‌కు ఎంపికైంది. తాజాగా ‘నేషనల్ యూత్ ఐకాన్’ అవార్డు వరించింది. దేశవ్యాప్తంగా వ్యాపారం, సామాజిక సేవ, క్రీడలు, విద్య, ఆరోగ్యం, మానవ హక్కులు, శాంతి, యువత సాధికారత, వినోదం, దాతృత్వం, కళలు వంటి విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ చూపుతున్న 30 మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపికచేయగా, వీరిలో అమేయ ఒకరు కావడం విశేషం.