Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 10:14 PM

ఏజెన్సీ వాసులను చలిపులి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కుమ్ముకుంటున్నది.

వణికిస్తున్న చలి
జిల్లా కేంద్రం పాడేరులో చలికి మంట కాగుతున్న జనం

జి.మాడుగులలో 3.3 డిగ్రీలు

పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉదయం పది గంటల వరకు

కమ్ముకుంటున్న పొగమంచు

మంటలు కాగుతున్న గిరిజనులు

పాడేరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వాసులను చలిపులి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కుమ్ముకుంటున్నది. శనివారం జి.మాడుగులలో 3.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండు వారాలుగా ఏజెన్సీలోని వాతావరణం మారిపోయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో ఉదయం పది గంటల వరకు పొగ మంచు దట్టంగా కమ్ముకోగా కేవలం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మాత్రమే సాధారణ స్థాయిలో ఎండ కాస్తున్నది. అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి చలి ప్రభావం కొనసాగుతున్నది. ప్రస్తుతం చలి తీవ్రతకు పలువురు ఉన్ని దుస్తులు ధరిస్తుండగా, మరి కొందరు మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతున్నాయి. శనివారం జి.మాడుగులలో 3.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా డుంబ్రిగుడలో 4.2, హుకుంపేట, అరకులోయలో 4.9, పాడేరులో 7.5, అనంతగిరిలో 7.6, చింతపల్లిలో 7.9, పెదబయలులో 8.2, ముంచంగిపుట్టులో 9.0, కొయ్యూరులో 10.6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Updated Date - Jan 11 , 2025 | 10:14 PM