రంగవల్లుల సందడి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:18 AM
అనకాపల్లిటౌన్/కొత్తూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి పట్టణానికి తొమ్మిది రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్)’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు రంగవల్లులు, గొబ్బెమ్మలు, రంగురంగుల పూలతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.
అనకాపల్లిలో ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి-‘ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు
రకరకాల ముగ్గులతో వెల్లివిరిసిన తెలుగు సంప్రదాయం
పట్టణానికి ముందస్తుగానే సంక్రాంతి పండుగ
అనకాపల్లిటౌన్/కొత్తూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) :
అనకాపల్లి పట్టణానికి తొమ్మిది రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్)’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు రంగవల్లులు, గొబ్బెమ్మలు, రంగురంగుల పూలతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. స్థానిక స్పాన్సర్‌గా కొణతాల సుబ్రహ్మణ్యం అప్పలనర్సమ్మ ట్రస్టు వారు వ్యవహరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ముగ్గుల పోటీలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 58 మంది మహిళలు, యువతులు ముగ్గుల పోటీల్లో పాలుపంచుకున్నారు. సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పలు రకాల ముగ్గులు వేశారు. రకరకాల ముగ్గులతో ఎన్టీఆర్ స్టేడియం గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ముగ్గుల పోటీలు ఒంటి గంటకు ముగిశాయి. అనంతరం న్యాయనిర్ణేతలు ప్రతీ ముగ్గును నిశితంగా పరిశీలించి, నిబంధనల మేరకు ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. అనకాపల్లి గవరపాలెం నీలకంఠరావు వీధికి చెందిన బి.వరలక్ష్మి ప్రథమ బహుమతికి (రూ.6 వేలు), తుమ్మపాలకు చెందిన సిహెచ్.అన్నపూర్ణ ద్వితీయ బహుమతికి (రూ.4 వేలు), కశింకోట అమిరపల్లి వీధికి చెందిన కె.యశ్విత తృతీయ బహుమతికిఇ (రూ.3 వేలు) ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమానికి ఎ.డి. ఇంగ్లీషు మీడియం స్కూలు అధినేత కొణతాల రఘునాథ్, డైరెక్టర్ పీలా అనుష సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్ హాజరై విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందించారు.
..... మరిన్ని ఫొటోలు, వార్త 8వ పేజీలో