కేజీహెచ్‌లో మరో రెండు డయాలసిస్ సెంటర్లు
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:02 AM
కింగ్‌జార్జ్ ఆస్పత్రిలోని రెండు వార్డుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆస్పత్రి లోని భావననగర్, రాజేంద్రప్రసాద్ వార్డుల్లో వీటిని ఏర్పా టు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్డుల్లో వివిధ అనారో గ్య సమస్యలతో ప్రతిరోజూ పదులసంఖ్యలో రోగులు చేరు తుంటారు.
భావననగర్, రాజేంద్రప్రసాద్ వార్డుల్లో ఏర్పాటుకు చర్యలు
తొలి విడత పది పడకలతో ప్రతిపాదనలు
రూ.60 లక్షలు ఖర్చవుతుందని అంచనా
ప్రస్తుతం నెఫ్రాలజీ, నెఫ్రోప్లస్ విభాగాల్లో సేవలు
విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
కింగ్‌జార్జ్ ఆస్పత్రిలోని రెండు వార్డుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆస్పత్రి లోని భావననగర్, రాజేంద్రప్రసాద్ వార్డుల్లో వీటిని ఏర్పా టు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్డుల్లో వివిధ అనారో గ్య సమస్యలతో ప్రతిరోజూ పదులసంఖ్యలో రోగులు చేరు తుంటారు. వీరిలో చాలామందికి డయాలసిస్ అవసర మవుతుంటుంది. ఈ సేవలు అందించేందుకు రోగులను సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లోని నెఫ్రాలజీ విభాగంలో ఉన్న డయాలసిస్ యూనిట్‌కు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ ఇబ్బం దులను గుర్తించిన అధికారులు అత్యవసరమైన చోట్ల డయాలసిస్ చేసే సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భావననగర్, రాజేంద్ర ప్రసాద్ వార్డుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఇందులో భాగంగా తొలి విడత పది పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నాలుగు డయాలసిస్ యంత్రాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ప్రతి రోజూ 50 మందికి సేవలు..
ప్రస్తుతం కేజీహెచ్‌లో ప్రతిరోజూ 50 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. నెఫ్రాలజీ విభాగంలోని పది డయాలసిస్ యంత్రాలతో ఉన్న సెంటర్‌లో ప్రతిరోజూ 20 మందికి సేవలు అందుతుండగా, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోనే నెఫ్రోప్లస్ అనే సంస్థ ద్వారా ప్రత్యేకంగా రోజుకు 30 మదికి డయాలసిస్ సేవలందిస్తున్నారు. నెఫ్రోప్లస్‌లో అందించే సేవలకు ఓపీ విధానంలో రోగులు డయాలసిస్ చేయించుకుని వెళ్తుంటారు. కాగా వార్డులో ఇన్‌పేషెంట్లు, ఇతర విభాగాల నుంచి వచ్చే వారికి సేవలందిస్తారు. ఇతర విభాగాల్లో ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులను ఇక్కడకు తీసుకువచ్చి సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రత్నామ్నాయంగా ఈ రెండు వార్డుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.