Share News

ఉత్తర ద్వారంలో ఉపమాక వెంకన్న

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:01 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. ఉపమాక వెంకన్నను ఉత్తరద్వారం నుంచి దర్శించుకోవడానికి తెల్లవారుజాముకే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని క్యూ లైన్లనీ కిటకిటలాడాయి.

ఉత్తర ద్వారంలో ఉపమాక వెంకన్న
ఉపమాక క్షేత్రంలో శ్రీరంగనాఽథుడిగా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు

శ్రీరంగనాథుడి అవతారంలో భక్తులకు దర్శనం

గోవిందనామ స్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

నక్కపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. ఉపమాక వెంకన్నను ఉత్తరద్వారం నుంచి దర్శించుకోవడానికి తెల్లవారుజాముకే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని క్యూ లైన్లనీ కిటకిటలాడాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటలకు కొండపై వున్న ఆలయంలో స్వామివారి నిజరూపానికి అర్చకులు పంచామృతాభిషేకం చేసి, ధూప, దీప నైవేద్య నీరాజన మంత్రపుష్పాలు సమర్పించిన అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. కింద ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తిని శేషతల్పంపై పవళిస్తున్నట్టు, ఆయన పాదాల చెంత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఉంచి ఉత్తరద్వారం గుండా భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలయాన్ని దర్శించుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ మోహన్‌, నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 01:01 AM