Share News

పందెంకోళ్లకు వైరస్‌ దాడి...పెంపకదార్లుకు తీవ్రనష్టాలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:15 AM

ప్రతికూల వాతావరణంలో నాటుకోళ్ల,పందెం కోడిపై వైరస్‌ దాడిచేసింది.కోళ్ల పెంపకందారులు ఆర్ధికంగా నష్టంపోతున్నారు. పందెం కోళ్లపై రాణికేట్‌(కొక్కెరవ్యాధి)ఇతర వైరస్‌ల కారణంగా గ్రామాల్లో ఎంతో శ్రఽద్దగా పెంచుకున్న కోడి పుంజులు నిముషాల వ్యవధిలో మృత్యువాత పడుతున్నాయని పెంపకం దారులు లబోదిబోమంటున్నారు.

పందెంకోళ్లకు వైరస్‌ దాడి...పెంపకదార్లుకు తీవ్రనష్టాలు
లింగాపురంలో చనిపోయిన నాటుకోడి

కోటవురట్ల, జనవరి 2(ఆంరఽధజ్యోతి):ప్రతికూల వాతావరణంలో నాటుకోళ్ల,పందెం కోడిపై వైరస్‌ దాడిచేసింది.కోళ్ల పెంపకందారులు ఆర్ధికంగా నష్టంపోతున్నారు. పందెం కోళ్లపై రాణికేట్‌(కొక్కెరవ్యాధి)ఇతర వైరస్‌ల కారణంగా గ్రామాల్లో ఎంతో శ్రఽద్దగా పెంచుకున్న కోడి పుంజులు నిముషాల వ్యవధిలో మృత్యువాత పడుతున్నాయని పెంపకం దారులు లబోదిబోమంటున్నారు. కోటవురట్లమండలంలోని తంగేడు, లింగాపురం, కైలాసపట్నం, టి జగ్గంపేట, పందూరు, సుంకపూర్‌, కే వెంకటాపురం, తదితర గ్రామాల్లోగత నవంబరు, డిసెంబరులోవాతావరణంలో మార్పులతో కోళ్లకు ఆర్‌డి వైరస్‌, ఇతర ఇన్స్‌పెక్షన్లుసోకడంతో కోడి పంజులతోపాటు పెట్టలు, పిల్లలుసుమారు 600వరకు కూడా మృత్యువాత పడినట్టు సమాచారం.వాటివిలువ లక్షల్లో ఉంటుందని అంచనావేస్తున్నారు.ఈవ్యాధి గాలిద్వారా ఒకకోడినుంచి మరొక కోడికి సోకుతుంది.తంగేడు గ్రామానికిచెందిన ఓబ్బులు రెడ్డి సతీష్‌ వ్యవసాయం పనులుచేసుకుంటూ గత పది సంవత్సరాల నుంచి నాటుకోళ్ల, పందెంకోళ్ల పెంచుతున్నారు. ప్రతిఏడాది సంక్రాంతి పండుగకి సుమా రు 20నుంచి 30 కోడి పుంజులను పెంచి విక్రయాలుచేసే ఆర్ధికంగా సంపాదించుకునే వారు. అయితే వైరస్‌దాడి వల్ల సుమారు ఈరైతు వద్ద 13పందెం కోళ్ల మత్యువాత పడ్డాయి.సుమారు రెండులక్షలు వరకు ఈయనకు నష్టం వాటిల్లెంది. ఏడాది నుంచివ్యక్తిగత శ్రమతోపాటు పెట్టిన పెట్టుబడిపోయిందని లబోదిబోమంటున్నారు. మిగిలిన కోళ్ల పరిస్దితి ఏరోజు ఏలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

వేలరూపాయల కోడి పుంజులు

సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందేల కోసం ప్రత్యేకంగా పెంచుకునే కోడి పుంజుధర (10నుంచచి30 వేలువరకు వుంటుంది) వీటి పెంపకానికి ప్రత్యేక ఆహర నియమాలతో ఎంతోశ్రద్దగా పెంచుతారు. ప్రత్యేక పోషకాహారం,వ్యాక్సిన్‌లను ఇచ్చిశాస్ర్తీయ పద్దతుల్లో పెంచుతారు.సంక్రాంతి నెలరోజుల ముందే పందె ం పుంజులు చనిపోవడంతో పందెంరాయుళ్లుకు కోడిపంజులు కొరత ఉంటుంద ని పేర్కొంటున్నారు.రెండు, మూడేళ్లు ఎంతో శ్రద్దగా పెంచిన పందెం పుంజుల వైరస్‌తో చనిపోవడంతో పెంపకదారులు తీవ్రనష్టాలు బారినపడ్డారు. సంక్రాంతి కి కోడి పుంజులకు మంచిధరవస్తుందని భావించారు.ఇంతలో కోడిపుంజులు పెట్టలు రోజుల వ్యవధిలో మొత్తం మృత్యువాత పడటంతో పెట్టుబడిరాని పరిస్దితి నెలకొంది.

పోటోరైటఫ్‌:

2కేయుటి5:పెట్ల నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పశువైద్యశాల కోటవురట్ల,

నాటుకోడి, పందెంకోళ్లపై వైరస్‌ దాడి

పందెంకోళ్లు, నాటుకోళ్లు వైరస్‌ రాణికేట్‌(కొక్కెరవ్యాధి) ఇతర ఇన్స్‌పెక్షన్‌తో మృత్యువాత పడుతున్నాయి.కోటవురట్లమండలం గ్రామీణప్రాంతాల్లో ఈసమస్య ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పులు ముఖ్యం శీతాకాలంకోళ్లలో ఈసమస్య ఏర్పడుతుంది.ఈ సీజన్‌లో ఎక్కువగా వుంది. గాలి, నీరుతోపాటు మనుషులు పశు,పక్షుల ద్వారాకూడా వ్యాప్తిస్తుంది. వ్యాధిలక్షణాలు ఆకుపచ్చనిరెట్టప్రధాన లక్షణం. కాళ్ల రెప్పల పక్షవాతం లేదా మెడ ఒకవైపుకు తిరిగినట్టు ఉండేలక్షణా లు ఈవ్యాధిఅని చెప్పవచ్చు.

Updated Date - Jan 06 , 2025 | 01:15 AM