Share News

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:39 AM

నగరానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

గోపాలపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

నగరానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి శనివారం మఽధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎంకు ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌, ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. విమానాశ్రయం బయట కార్యకర్తల నుంచి చంద్రబాబునాయుడు వినతులు స్వీకరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నౌకాదళం నిర్వహించే సాహస విన్యాసాల ప్రదర్శనను తిలకించేందుకు బయలుదేరి వెళ్లారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ విప్‌ పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జీ, కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ పి.సంపత్‌ కుమార్‌, డీసీపీ డి.మేరీ ప్రశాంతి, ఆర్డీవో పి.శ్రీలేఖ ఉన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 01:39 AM