Share News

AP News: బాబోయ్ ఏంటి ఇది.. ఏకంగా కరెంట్ తీగలపైనే

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:50 AM

Andhrapradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ యువకుడు చేసిన పని తీవ్ర సంచలనం రేపుతోంది. యువకుడి తల్లికి నిన్న (మంగళవారం) సచివాలయం సిబ్బంది పెన్షన్ డబ్బులను అందజేశారు. దాన్ని గమనించిన యువకుడు.. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. న్యూఇయర్‌ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొంటానని.. అందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు.

AP News: బాబోయ్ ఏంటి ఇది.. ఏకంగా కరెంట్ తీగలపైనే
Parvathipuram Manyam district

పార్వీతీపురం మన్యం జిల్లా, జనవరి 1: తాగిన మనుషులు వింతవింతగా ప్రవర్తిస్తుంటారు. మితిమీరి తాగి వారు ఏం చేస్తున్నారో తెలియకుండా చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తారు. ఒక్కోసారి వారి పనులు చూస్తే నవ్వుతెప్పించేలా చేస్తాయి. అలాగే మరికొన్నిసార్లు భయాందోళనకు గురిచేస్తుంటాయి. తాగిన మత్తులో విచక్షణమరిచి ప్రవర్తిస్తుంటారు మందుబాబులు. మందు తాగేందుకు డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తుంటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం కోసం ఓ వ్యక్తి చేసిన పని గ్రామస్తులను అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఆ వ్యక్తం ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పాలకొండ మండలం ఎం సింగపురంలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ నానా హంగామా సృష్టించాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో వెంకన్న అనే యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి బీభత్సం సృష్టించాడు. కరెంట్ స్తంభంపై ఉన్న యువకుడిని చూసి గ్రామాస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ సదరు యువకుడు వినిపించుకోలేదు. మద్యం కోసం డబ్బులు ఇస్తామని చెప్పడంతో చివరకు వెంకన్న విద్యుత్ స్తంభం నుంచి కిందకు దిగడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.


కాగా.. యువకుడి తల్లికి నిన్న (మంగళవారం) సచివాలయం సిబ్బంది పెన్షన్ డబ్బులను అందజేశారు. దాన్ని గమనించిన యువకుడు.. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. న్యూఇయర్‌ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొంటానని.. అందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు ఇచ్చేది లేదని... తప్ప తాగి డబ్బులను వృధా చేస్తావని చెబుతూ డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించింది. డబ్బుల విషయంలో తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత చెప్పినా డబ్బులు ఇచ్చేందుకు తల్లి ససేమిరీ అనడంతో యువకుడు.. ఒక్కసారిగా విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చాల్ చేశాడు. డబ్బులు ఇస్తే గానీ కరెంట్ స్తంభం దిగేది లేదని మొండిపట్టుపట్టాడు. అయితే యువకుడు విద్యుత్ స్తంభాన్ని ఎక్కుతున్నట్లు గమనించిన గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యారు.

ఎంత చెప్పినా మారని మందుబాబులు


విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి.. విషయం తెలియజేసి కరెంట్ సరఫరాను నిలిచిపోయేలా చేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లైంది. దాదాపు గంట పాటు విద్యుత్ స్తంభంపై కూర్చుని, వైర్లపై పడుకుని వెంకన్న నానా హంగామా చేశాడు. కిందకు దిగాలంటూ గ్రామస్తులంతా కలిసి చాలాసేపు యువకుడిని బ్రతిమిలాడారు. తన తల్లి డబ్బులు ఇచ్చే దాకా కిందకు దిగే ప్రసక్తే లేదని వెంకన్న స్పష్టం చేశాడు. చివరకు మద్యం కోసం డబ్బులు ఇప్పిస్తామని గ్రామస్తులు ఒప్పించడంతో వెంకన్న విద్యుత్ స్తంభంపై నుంచి కిందకు దిగడంతో గ్రామస్తులు హమయ్య అని అనుకోవాల్సి వచ్చింది. ఒకవేళ విద్యుత్ సరఫరా జరిగి ఉంటే యువకుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది. అయితే వెంకన్న మొదటి నుంచి కూడా తాగుడికి బానిసై అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 01 , 2025 | 12:27 PM