Bhogi Festival : ఉత్సాహంగా భోగి
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:48 AM
విశాఖపట్నంలో భోగి పండుగను సోమవారం ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు.
విశాఖపట్నంలో భోగి పండుగను సోమవారం ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ వద్ద దేశీయ ఆవుపేడతో తయారుచేసిన లక్ష పిడకలతో భోగిమంట వేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి