Share News

80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:13 AM

80% Grain Procurement Completed జిల్లాలో ధాన్యం కొనుగోలు 80 శాతం పూర్తయ్యింది. ఇప్పటివరకు రైతుల ఖాతాలకు సుమారు రూ.394 కోట్లు జమ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పండగ ముందు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టి.. గంటల వ్యవధిలోనే ఖాతాల్లోకి సొమ్ము జమ చేయడంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

జిల్లా రైతులు హర్షం

పార్వతీపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు 80 శాతం పూర్తయ్యింది. ఇప్పటివరకు రైతుల ఖాతాలకు సుమారు రూ.394 కోట్లు జమ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పండగ ముందు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టి.. గంటల వ్యవధిలోనే ఖాతాల్లోకి సొమ్ము జమ చేయడంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం విక్రయాల సొమ్ము సకాలంలో జమ కాని పరిస్థితి. రైతులంతా బ్యాంకు మెసేజ్‌ల కోసం ఎదురుచూసేవారు. పంట విక్రయాలకూ అష్టకష్టాలు పడేవారు. దీంతో అప్పులు చేసి పండగ చేసుకోవాల్సిన దుస్థితి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ చర్యలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశాలతో జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, సివిల్‌ సప్లైస్‌ డీఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ నెల ఐదు నాటికి 1,74,675 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. ఈ మేరకు సుమారు రూ.394 కోట్లును ప్రభుత్వం చెల్లించింది. రైతుల బ్యాంకు ఖాతాలోకి ఆ నగదు జమ కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 06 , 2025 | 12:13 AM