చింతపల్లిలో జెట్టీ ఏర్పాటుచేయాలి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:03 AM
jetty : చింతపల్లిలో జెట్టీ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు.
పూసపాటిరేగ, జనవరి13(ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో జెట్టీ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు. మంగళగిరిలో జనసేన నాయకుడు లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. విశాఖ నుంచి భీమిలి వరకూ గల బీచ్ రోడ్డును చింతపల్లి వరకూ విస్తరిస్తే కోస్టల్ కారిడార్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు, బాల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
స్మారక కేంద్రాలు ఏర్పాటుచేయాలి
లక్కవరపుకోట, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని కిత్తన్నపేట గ్రామానికి చెందిన రచయిత, సాహితీవేత్త కిలారి గౌరినాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శేషేంద్రజాలం సంకలనం గ్రంథాన్ని బహూకరించారు. పల్లెపండుగ సం దర్భంగా పిఠాపురంలో ఆయనకు గుంటూరు శేషేంద్రశర్మ రచించిన గ్రంథాన్ని అందజేశారు.ఎ.సోమసుందర్, రాచకొండ విశ్వనాథశాస్త్రి స్మారక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన్ను కోరగా సుముఖత వ్యక్తం చేశారని గౌరినాయుడు తెలిపారు.