Share News

roads రహదారులకు కొత్త రూపు

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:18 AM

A new look for roads బొబ్బిలి ఆర్‌అండ్‌బీ డివిజన్‌ పరిధిలో మూడు కీలక రహదారుల దశ తిరగనుంది. ఆ రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారిన పరిస్థితిలో ప్రభుత్వ నిర్ణయం అటుగా ప్రయాణించే వారందరికీ ఊరట ఇవ్వనుంది. రెండు రహదారుల పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చిలకపాలెం- రాయగడ రాష్ర్టీయ రోడ్డు పీపీపీ కింద చేపట్టాలని ప్రతిపాదనలు వెళ్లాయి.

roads రహదారులకు కొత్త రూపు
ఆర్‌అండ్‌కి బదలాయించిన రోడ్డు

రహదారులకు కొత్త రూపు

బొబ్బిలి డివిజన్‌లో మూడు కీలక రోడ్ల అభివృద్ధికి చర్యలు

ఆర్‌అండ్‌బీకి అప్పగింత

చిలకపాలెం- రాయగడ రాష్ర్టీయ రోడ్డు పీపీపీ కింద చేపట్టాలని ప్రతిపాదనలు

బొబ్బిలి, జనవరి 5(ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి ఆర్‌అండ్‌బీ డివిజన్‌ పరిధిలో మూడు కీలక రహదారుల దశ తిరగనుంది. ఆ రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారిన పరిస్థితిలో ప్రభుత్వ నిర్ణయం అటుగా ప్రయాణించే వారందరికీ ఊరట ఇవ్వనుంది. రెండు రహదారుల పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చిలకపాలెం- రాయగడ రాష్ర్టీయ రోడ్డు పీపీపీ కింద చేపట్టాలని ప్రతిపాదనలు వెళ్లాయి.

తెర్లాం మండలంలో 7.73 కి.మీ జిల్లా పరిషత్‌ రోడ్డును ఆర్‌అండ్‌బీ విభాగానికి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెర్లాం మండలంలోని గొలుగు వలస, బూరిపేట, బూర్జవలస తదితర గ్రామాల మీదుగా వెళ్లే ఈ రోడ్డు నాన్‌బీటీ రహ దారిగా మార్చాలని ఆదేశిస్తూ ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. అలాగే ముగడ- జె.రంగరాయపురం రహదారి (7.3కి.మీ)ని జడ్పీ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించారు. ఇక్కడ బీటీ రోడ్డు వేయనున్నారు. దీంతో ఈ ప్రాంత గ్రామీణులకు రహదారి కష్టాలు తీరనున్నాయి. అలాగే చిలకపాలెం- రాయగడ రాష్ర్టీయ రహదారి(ఉత్తరావల్లి నుంచి బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి మీదుగా లచ్చయ్యపేట వరకు)ని పీపీపీ (పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్టిసిపేషన్‌) ప్రాతిపదికన రోడ్డుకు మరమ్మతులు, నిర్వహణ చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడ్డాయి. రవాణాకు, ప్రయాణానికి నరకం చూపుతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై ప్రఽధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. మిషన్‌ పీవోటీ కింద రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని నిర్ణయించింది. సంక్రాంతి పండగకల్లా అన్ని గుంతలనూ పూడ్చాలని అధికారులను ఆదేశించిది. గుంతలను పూడ్చలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే అది ప్రజాప్రతినిధులదే బాధ్యత అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. అయితే సంక్రాంతికల్లా పూర్తిస్థాయిలో రోడ్లపై గుంతలు కప్పడం అసాధ్యమని కొందరు అధికారులు చెబుతున్నారు.

ఫ మిషన్‌ పీవోటీ కింద జీవో 53లో 9 పనులకు రూ.147.60 లక్షలు, జీవో 348 ప్రకారం 4 రోడ్ల పనులకు రూ.145 లక్షలు, జీవో 349 ప్రకారం 9 రోడ్లకు రూ.40.35 లక్షలు మంజూరయ్యాయి. రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రారంభించడమే ఉంది.

కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాం

ఆర్‌.రవిశేఖర్‌, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, బొబ్బిలి

వర్షాలు కురవడంతో రోడ్ల పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 50 శాతం గుంతలను సంక్రాంతికి పూడ్చగలం. టెండర్ల ప్రక్రియపూర్తయింది. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాము. మరికొన్ని రహదారుల కోసం ప్రతిపాదనలు పంపాం.

Updated Date - Jan 06 , 2025 | 12:18 AM