Share News

undergoing treatment man died: చికిత్సపొందుతూ చెముడుగూడ వాసి మృతి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:42 PM

undergoing treatment man died: చెముడుగూడ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్‌ చికిత్సపొందుతూ మృతిచెందాడు.కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేర కు... గతఏడాది డిసెంబరు 29 గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ఉత్సవాల్లో కందికొట్ల పం డుగలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం విదితమే.

undergoing treatment man died:  చికిత్సపొందుతూ చెముడుగూడ వాసి మృతి
రమేష్‌ కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తున్న జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, జనవరి1(ఆంధ్రజ్యోతి):చెముడుగూడ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్‌ చికిత్సపొందుతూ మృతిచెందాడు.కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేర కు... గతఏడాది డిసెంబరు 29 గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ఉత్సవాల్లో కందికొట్ల పం డుగలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం విదితమే. మరుగుతున్న సాంబారులో ప్రమాదవశాత్తు చెముడుగూడ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్‌ జారి పడడంతో శరీరం 90 శాతం కాలిపోయింది. దీంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స అనంతరం పార్వ తీపురం తరలించారు. అక్కడినుంచి విశాఖ కేజీహెచ్‌ రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈమేరకు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌,ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి చెముడుగూడలో రమేష్‌ కుటుంబ సభ్యులను బుధవారం సాయంత్రం పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాడి సుదర్శనరావు, ఎంపీటీసీ సభ్యుడు మండంగి రమణ పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:42 PM