rural roads: ప్రతి గ్రామానికి రహదారి
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:34 PM
rural roads: ప్రతి గ్రామానికి రహదారి సౌక ర్యం కల్పిస్తామని పాతపట్నం ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం కరజాడ నుంచి టకోయి గ్రామానికి రహదారి పనులకు భూమి పూజచేశారు.
మెళియాపుట్టి, జనవరి 2(ఆంద్రజ్యో తి): ప్రతి గ్రామానికి రహదారి సౌక ర్యం కల్పిస్తామని పాతపట్నం ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం కరజాడ నుంచి టకోయి గ్రామానికి రహదారి పనులకు భూమి పూజచేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో విధ్వంసం తప్పా అభివృద్ధి కనిపించ లేదన్నారు. చంద్రబాబునాయుడు ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి కావడం ప్రజలు అదృష్టమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు టకోయి గ్రా మానికి రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రూ.రెండు కోట్లతో పనులు చేపడుతుండడంతో సజావుగా పలాస మండలానికి వెళ్లే అవకావశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బమ్మిడి భాస్కరరావు, మాజీ ఎంపీపీ సలాన మోహనరావు, భాస్కర్‌గౌడో, అనపాన రాజశేఖరెడ్డి, పీఆర్‌డీఈ శివప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.