Share News

రోగులకు మెరుగైన సేవలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:05 PM

Better Services for Patients జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విధుల్లో చేరారు. ముందుగా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

రోగులకు  మెరుగైన సేవలు
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విధుల్లో చేరారు. ముందుగా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇన్‌చార్జి డీంహెచ్‌వో విజయపార్వతి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గతంలో ఐటీడీఏ డిప్యూటీ డీఎం హెచ్‌వోగా విధులు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. ఈ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులతో పాటు రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటామమని తెలిపారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని సూచిచారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

గరుగుబిల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. గరుగుబిల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. విధుల నిర్వహణపై సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదని తెలిపారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. రోగులకు అవసరమైన మందులు, పాము, కుక్క కాట్లుకు సంబంధించిన వ్యాక్సిన్ల నిల్వలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యశాఖ పరిధిలో నిర్వహిస్తున్న సర్వేలను సక్రమంగా నిర్వంచాలన్నారు. హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో డేటా ఎంట్రీ వివరాలతో పాటు సిబ్బంది హాజరు, పలు రికార్డులను పరిశీంచారు. ఈ పరిశీలనలో జిల్లా కార్యక్రమ అధికారి వినోద్‌కుమార్‌, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:05 PM