Share News

కోడి పందేలను డ్రోన్‌ కెమెరాలతో కనిపెడతాం

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:00 AM

Chicken races are detected with drone cameras జిల్లా ప్రజలు సంక్రాంతిని సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచిస్తూ కోడి పందేలను నిర్వహిస్తే డ్రోన్‌ కెమెరాలతో కనిపెడతామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కోడి పందేలను డ్రోన్‌ కెమెరాలతో కనిపెడతాం
ఎస్పీ వకుల్‌ జిందాల్‌

కోడి పందేలను డ్రోన్‌ కెమెరాలతో కనిపెడతాం

సంక్రాంతిని సంప్రదాయపద్ధతిలో జరుపుకోండి

ఎస్పీ వకుల్‌జిందాల్‌

విజయనగరం క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు సంక్రాంతిని సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచిస్తూ కోడి పందేలను నిర్వహిస్తే డ్రోన్‌ కెమెరాలతో కనిపెడతామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోడిపందేలు, పేకాట నిర్వహించేవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో పేకాట, కోడి పందేలతో ప్రమేయం వున్న 109 మందిని గుర్తించి మంచి ప్రవర్తన కోసం బైండోవర్‌ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో కోడి పందేలు నిర్వహించే ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షిస్తామన్నారు. సంక్రాంతి పండుగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడి పందేల నియంత్రణకు హైకోర్టు ఆదేశాలతో మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసులు, జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పండుగలకు సొంత గ్రామాలకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:00 AM