Share News

హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:30 PM

Do Not Worry About HMPV చైనాలో గుర్తించిన కొత్త వైరస్‌ హెచ్‌ఎంపీవీ (హ్యూమన్‌ మెటాన్యూమో వైరస్‌)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మంగళవారం తన కార్యాలయం నుంచి పీహెచ్‌సీ వైద్యులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కరరావు

పార్వతీపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): చైనాలో గుర్తించిన కొత్త వైరస్‌ హెచ్‌ఎంపీవీ (హ్యూమన్‌ మెటాన్యూమో వైరస్‌)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మంగళవారం తన కార్యాలయం నుంచి పీహెచ్‌సీ వైద్యులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హెచ్‌ఎంపీవీపై క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. దగ్గు, జలుబు, తుంపరల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అయితే జిల్లాలో వైరస్‌ ప్రభావం లేదని, అయినప్పటికి వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పండగ సమయం కావండతో ప్రజలు కూడా సహకరించాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి సందేహం ఉన్నా వెంటనే సమీపంలోఉన్న ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా పోగ్రాం అధికారి డా.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

- వీరఘట్టం: బీటీవాడ పీహెచ్‌సీని మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌వో ఎస్‌.భాస్క రరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవగాహన ఉండాలని, ముందు జా గ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. రక్తహీనత కమిటీల పనితీరును పర్యవేక్షించాలన్నారు. డీఎంహెచ్‌వో వెంట జిల్లా నోడల్‌ అధికారి ఎం.వినోద్‌కుమార్‌, వైద్యులు మానస, నితీష్‌ ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:30 PM