dont do కోడిపందేలు నిర్వహించొద్దు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:15 AM
Don't hold a cockfight జిల్లాలో కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్‌జిందాల్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాటలు నిర్వహించినా.. బెట్టింగులకు పాల్పడనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడినా ఊపేక్షించేది లేదని హెచ్చరించారు.
కోడిపందేలు నిర్వహించొద్దు
ఎస్పీ వకుల్‌జిందాల్
నిఘా పెంచాలని అధికారులకు ఆదేశాలు
విజయనగరం క్రైం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్‌జిందాల్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాటలు నిర్వహించినా.. బెట్టింగులకు పాల్పడనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడినా ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడి, అరెస్టు అయిన వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కోడి పందాలు నిర్వహించే వారిపైన, కోడి కత్తులను తయారు చేసేవారిపైనా, కోడి పుంజులకు కత్తులు కట్టేవారిపైనా నిఘా పెట్టాలని అధికారులకు చెప్పామని పేర్కొన్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోండి
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లే వారు ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా లాక్‌డ్ హౌస్ మోనటరింగు సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. దొంగతనాల నియంత్రణకు రాష్ట్ర పోలీసుశాఖ ఈ సిస్టంను ప్రత్యేకంగా రూపొందిం చిందన్నారు. తొలుత గూగూల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని పేరు, ఫోన్ నెంబరు, లొకేషన్ తదితర వివరాలను ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో ఎంటర్ చేయాలని, రిక్వస్ట్ పంపిన తరువాత పోలీసులు ఇంటిని సందర్శించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయా ఇళ్లపై ప్రత్యేకంగా నిఘా పెడతారన్నారు.