Farmers : సాలూరు మన్యంలో రైతులకు ఇక్కట్లు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:46 PM
Farmers : సాలూరు మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండబెట్టడానికి అగచాట్లు పడుతున్నారు. సంక్రాంతి సమీపిస్తుండంతో పలు గ్రామాల్లో కళ్లాలకు చేర్పిన పంటను ముమ్మరంగా నూర్పిడి చేస్తున్నారు.
సాలూరు రూరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సాలూరు మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండబెట్టడానికి అగచాట్లు పడుతున్నారు. సంక్రాంతి సమీపిస్తుండంతో పలు గ్రామాల్లో కళ్లాలకు చేర్పిన పంటను ముమ్మరంగా నూర్పిడి చేస్తున్నారు. ధాన్యం విక్రయించి పండగను సందడిగాచేసుకోవాలని నూర్పిడి వేగవంతం చేశా రు. కాగా గతఏడాది శివారులో పంటచేతికి వచ్చిన సమయంలో ఎడ తెరిపిలేని వర్షాలు కురిసిన విషయం విదితమే. దీంతో కొన్నిచోట్ల కోసిన పంట తడిసిపోయింది. మరికొన్ని చోట్ల ఆదరాబాదరాగా కుప్పలుగా పెట్టినా అందులోకి నీరు చొరబడింది. దీనికితోడు వర్షాల నుంచి చేతి కొచ్చిన పంటను ఎలాగైనా రక్షించుకోవాలన్న ఆతృతతో కొందరు పచ్చి కంకులనే యంత్రాలతో నూర్పిన విషయం తెలిసిందే. అయితే రోజులు తరబడి వర్షాలు కురవడంతో కొన్నిచోట్ల ముక్కిపోగా, మరికొన్నిచోట్ల తడి సిపోయాయి. ప్రస్తుతం వర్షాలకు తెరిపిచ్చి ఎండలు పెడుతుండడంతో తడిసిపోయిన వరి ధాన్యం రహదారులు, కళ్లాల్లో రైతులు ఆరబెడుతు న్నారు. వర్షాలకు తడిసిపోయిన కుప్పలను కూడా త్వరగా నూర్పిడి చేయకపోతే పాడయ్యే ప్రమాదముండడంతో పనులు ముమ్మరం చేశారు.
రంగుమారిన ధాన్యం
గత ఏడాది డిసెంబరు శివారులో కురిసిన వర్షాలకు పంటను ఎలాగైనా రక్షించుకోవాలని ఆదరాబాదరాగా నూర్పిడిచేశారు. ఆ ధాన్యం వర్షాలకు తేమ చేరి రంగుమారాయి. ప్రభు త్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలు, ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించా లంటే తొలుత వారు తేమశాతాన్ని గణి స్తారు. కొనుగోలుకేంద్రాల్లో ప్రభుత్వం నిర్ధేశిం చిన మేరకు ధాన్యం ఉండాలని అధికారులు స్పష్టంచేశారు. అయితే ప్రస్తుతం రైతులు ధాన్యంతేమశాతం తగ్గించడానికి అగచాట్లుప డుతున్నారు. దీంతో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారులు, కళ్లాలు, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఎండబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడానికి వరకు నిబంధనలు సరళతరం చేయాలని కొందరు రైతులు కోరుతున్నారు.