Share News

హామీలు అమలు చేస్తున్నాం

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:53 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు.

హామీలు అమలు చేస్తున్నాం

బలిజిపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు. బలిజిపేట మండలంలో గలావిల్లి గ్రామం నుంచి కొత్త గలావిల్లి గ్రామం వరకు రూ.2కోట్లతో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిం చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కిడ్నీ బాధితులను ఆదుకుంటాం

శ్రీరంగరాజపురంలో కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుం టామని ఎమ్మెల్యే విజయచంద్ర భరోసా ఇచ్చారు. గ్రామానికి సరఫరా అవుతున్న తాగునీటిని ఆయన శుక్రవారం పరిశీలించారు. కిడ్నీ వ్యాధి తో ఇటీవల ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గ్రామానికి రహదారి సౌకర్యంతో పాటు కిడ్నీ బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:53 PM