హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:27 AM
మున్సిప ల్ కార్మికులకు సమ్మె కాలపు హామీల జీవోలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు
పాలకొండ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ కార్మికులకు సమ్మె కాలపు హామీల జీవోలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఈ మేర కు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ నగర పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. జీవో నెంబరు 36 ప్రకారం రూ.21 వేలు ఇవ్వాలని, ప్రభుత్వం నియ మించిన 9 మంది కమిటీ సిఫార్సుల ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ కార్యదర్శి సీహెచ్ సంజీవి, సభ్యులు ఎన్.సాయికుమార్, సీహెచ్ కార్తీక్, పి.సూరిబాబు దీక్షలో పాల్గొన్నారు. వేణు, అప్పలనాయుడు, కృష్ణవేణి, బాబూరావు తదితరులు సంఘీభావం తెలిపారు.