no quality: నాణ్యత లేక.. నిర్వహణకు నోచుకోక
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:49 PM
no quality: మండలంలోని వెన్నె గ్రామంలో రైతుల ఎదుగుల కళ్లాల నుంచి శ్మశానానికి రాకపోకల కోసం నిర్మించిన రోడ్డు అధ్వానంగా మారింది. 2022లో రూ. ఆరు లక్షల వ్యయంతో వేసిన మెటల్‌రోడ్డు పూర్తిగా పాడైంది.
జామి, జనవరి 1(ఆంఽధ్రజ్యోతి): మండలంలోని వెన్నె గ్రామంలో రైతుల ఎదుగుల కళ్లాల నుంచి శ్మశానానికి రాకపోకల కోసం నిర్మించిన రోడ్డు అధ్వానంగా మారింది. 2022లో రూ. ఆరు లక్షల వ్యయంతో వేసిన మెటల్‌రోడ్డు పూర్తిగా పాడైంది. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతోపాటు నిర్వహణకు నోచుకోకపోవడంతో పెద్దపెద్ద గోతులు ఏరడ్పాయని గ్రామస్థులు వాపోతున్నారు.చిన్నపాటి వర్షం కురిసే బురదమయంకావడంతో రాకపోకలకు ఇబ్బందిపడాల్సివ స్తోంది. రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు అఽధికారులు పర్యవేక్షించకపోవడం వల్లే త్వరగా పాడయ్యిందని ఆ గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ రోడ్డుకు మర మ్మతులు నిర్వహించి, తమ అవస్థలు తీర్చాలని పలువురు రైతులు కోరుతున్నారు. కాగా రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ జేఈ నాయుడు తెలిపారు.