Share News

ఇలా అయితే సాగునీరు అందేదెలా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:55 PM

కురుపాం సమీపంలో గల గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు వద్ద గత రెండు రోజుల కిందట ఒక తలుపు ఊడిపోయింది.

ఇలా అయితే సాగునీరు అందేదెలా?

కురుపాం/ రూరల్‌, జనవరి3(ఆంధ్రజ్యోతి): కురుపాం సమీపంలో గల గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు వద్ద గత రెండు రోజుల కిందట ఒక తలుపు ఊడిపోయింది. దీంతో సాగు నీరు వృథాగా గెడ్డలో కలిసిపోతుంది. దీంతో వరి పొలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తలుపు మరమ్మతులు చేపట్టాలని నీటి సంఘం అధ్యక్షులు పండాల శ్రీనివాసరావు, మరాపు సింహాచలం, బంటు తవిటినాయుడు, తెంటు జగనాథం నాయుడు, పోలిరెడ్డి శ్రీనివాసరావు కోరారు. ఈ విషయం ఇరిగేషన్‌ అధికారులకు తెలియజేశామని తెలిపారు. ఫ దీనిపై గుమ్మిడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ జేఈ జి.భావనకు వివరణ కోరాగా రైతులు శుక్రవారం ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పారు. అయితే ఎన్నికల విధులు ఉండటంతో వెళ్లలేకపోయామని, ఈ విషయం డీఈఈకి తెలియజేశామన్నారు. వెంటనే తాత్కలికంగా పనులు చేపట్టి రబీకి నీరు అందిస్తామని తెలిపారు.

Updated Date - Jan 03 , 2025 | 11:55 PM