Share News

street lights తక్షణమే వీధిలైట్లు వేయండి

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:23 PM

Immediately install streetlights ‘టిడ్కో కాలనీల్లో వెంటనే వీధిలైట్లు వేయండి.. ప్రహరీ, ఆర్చ్‌ నిర్మించండి.. దొంగతనాలకు అవకాశం లేకుండా పోలీసు ఔట్‌పోస్టుని ఏర్పాటు చేయండి.. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వండి.. ఫిబ్రవరి తొలి వారం నాటికి లబ్ధిదారులంతా నివాసం ఉండేలా చూడండి’ అంటూ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అధికారులను ఆదేశించారు.

street lights తక్షణమే వీధిలైట్లు వేయండి
రోడ్డును పరిశీలిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు

తక్షణమే వీధిలైట్లు వేయండి

ప్రహరీ, ఆర్చ్‌ నిర్మించండి

వచ్చేనెల మొదటి వారానికి అందరూ వచ్చేలా చూడండి

టిడ్కో కాలనీ సందర్శనలో కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం రూరల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘టిడ్కో కాలనీల్లో వెంటనే వీధిలైట్లు వేయండి.. ప్రహరీ, ఆర్చ్‌ నిర్మించండి.. దొంగతనాలకు అవకాశం లేకుండా పోలీసు ఔట్‌పోస్టుని ఏర్పాటు చేయండి.. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వండి.. ఫిబ్రవరి తొలి వారం నాటికి లబ్ధిదారులంతా నివాసం ఉండేలా చూడండి’ అంటూ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం శివారు ప్రాంతాలైన కొండవెలగాడరోడ్డులోని సోనియానగర్‌, సారిపల్లిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో నిర్మితమైన టిడ్కో ఇళ్ల సముదాయాలను ఆయన ఎమ్మెల్యే అదితిగజపతిరాజుతో కలిసి గురువారం సందర్శించారు. రోడ్లు, కాలువలు లేకపోవడం.. మంచినీరు సరఫరా కాకపోవడం..విద్యుత్‌ సరఫరా కూడా ఇవ్వకపోవడం చూసి ఆయన విస్తుపోయారు. కేవలం మూడు కుటుంబాలే నివాసం ఉంటున్నట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, విద్యుత్‌ సమస్య పరిష్కరి ంచేందుకు సమీపంలోని నిర్మించిన సబ్‌స్టేషన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వారి వెంట తూర్పుకాపుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, మెప్మా పీడీ సత్తిరాజు, టిడ్కో ఈఈ రమణమూర్తి, తహసీల్దార్లు కూర్మనాథరావు, సుదర్శన్‌, నెల్లిమర్ల నగరపాలక సంస్థ కమిషనర్‌ అప్పలరాజు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు,ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగాబురుబాబు, బొద్దల నర్సింగరావు, అవానపు విజయ్‌, కర్రోతు నర్సింగరావు, అనురాధ, బీజెపీ నాయకులు సుధీర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:23 PM