Share News

snow మంచుతెరలో..

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:18 PM

In the snow మంచు రహదారులను కప్పేస్తోంది. పల్లె, పట్టణ పరిసరాలపై తెల్లటి తెరను పరిచేస్తోంది. చెట్ల ఆకుల నుంచి చిన్నపాటి బిందువులను నేలపై చిలకరిస్తోంది. ఈ క్రమంలో కమనీయ దృశ్యాలను ఆవిష్కరిస్తోంది.

snow మంచుతెరలో..
విశాఖ-శ్రీకాకుళం రోడ్డులో పూసపాటిరేగ వద్ద మంచు దృశ్యం

మంచుతెరలో..

మంచు రహదారులను కప్పేస్తోంది. పల్లె, పట్టణ పరిసరాలపై తెల్లటి తెరను పరిచేస్తోంది. చెట్ల ఆకుల నుంచి చిన్నపాటి బిందువులను నేలపై చిలకరిస్తోంది. ఈ క్రమంలో కమనీయ దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. కొద్దిరోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు జిల్లా మంచు దుప్పట్లోనే ఉంటోంది. బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే మంచు వానకు తడిసిపోతున్నారు. ఇక వాహనదారులైతే ఎక్కడికక్కడ ఆగుతూ.. బయలుదేరుతూ ముందుకు సాగుతున్నారు. కొందరైతే మంచులోనే చలిమంటలు వేసుకుంటూ విభిన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. యువత ఫోజులిచ్చి క్లిక్‌ మనిపిస్తున్నారు. ఈ మంచుతో అన్నదాతలకు కాస్త అగచాట్లు తప్పడం లేదు. పొలంలో ఉన్న వరి కుప్పలు తడుస్తుండడంతో వరి కంకులను ఇంటికి చేర్చే పనిలో నిమగ్నమయ్యారు.

- విజయనగరం-ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 03 , 2025 | 11:18 PM