Share News

Republic celebrations: గణతంత్ర వేడుకలకు భూదేవికి ఆహ్వానం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:51 PM

Republic celebrations: సీతంపేటలో నివాసం ఉంటున్న నారీ శక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవికి భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.

 Republic celebrations: గణతంత్ర వేడుకలకు భూదేవికి ఆహ్వానం
భూదేవి

పాలకొండ, జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): సీతంపేటలో నివాసం ఉంటున్న నారీ శక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవికి భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. భూదేవి ఆదివాసీలతో కలిసి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, గిరిజన ప్రాంతాల్లో పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం... వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని గుర్తించి గణతంత్ర వేడుకలలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ... ఈ ఆహ్వానాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమైందని చెప్పారు. దీనితో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:51 PM