Share News

16న కనకదుర్గమ్మ తీర్ధమహోత్సవం

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:09 AM

కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్ధ మహో త్సవం ఈనెల 16న జరగనుంది. ఈనేపధ్యంలో సోమవారం విజయనగరం రూరల్‌ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ సాయికృష్ణ ఆలయం వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.

16న కనకదుర్గమ్మ తీర్ధమహోత్సవం
గంట్యాడ: ఆలయం వద్ద నిర్వాహకులతో మాట్లాడుతున్న పోలీసులు :

గంట్యాడ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్ధ మహో త్సవం ఈనెల 16న జరగనుంది. ఈనేపధ్యంలో సోమవారం విజయనగరం రూరల్‌ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ సాయికృష్ణ ఆలయం వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం నిర్వాహకులు వేమలి ముత్యాలు నాయుడును తీర్ధ మహోత్సవం ఏర్పాట్లపై అడిగితెలుసుకున్నారు.తీర్ధమహోత్సవానికి ఎంత మందివస్తారు, ఇక్కడకి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా నిర్వహణ, వాహ నాలు పార్కింగ్‌పై నిర్వాహకులతో చర్చించారు. భక్తులు ఇబ్బంది కల్గకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ నిర్వాహకులు పోలీసులను కోరారు.

రేపు కృష్ణరాయుడుపేటలో ..

వేపాడ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణరాయుడుపేట, గుడి వాడ కొండగుళ్ల తీర్థంలో కనుమ పురస్కరించుకుని బుధవారం తీర్ధ మహో త్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లుచేస్తున్నారు. కోడి పందేలు, ఎడ్ల పరుగు ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌శాఖ హెచ్చరిస్తున్నా నిర్వాహ కులు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.

Updated Date - Jan 14 , 2025 | 12:09 AM