గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకురండి
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:10 AM
బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి జెండా వీధిలో నిర్మాణ దశలో ఉన్న శాఖా గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే బేబీనాయన గురువారం పరిశీలించా రు.
బొబ్బిలి రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి జెండా వీధిలో నిర్మాణ దశలో ఉన్న శాఖా గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే బేబీనాయన గురువారం పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పోటీ పరీక్షల దృష్ట్యా నిరుద్యోగులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా త్వరితగతిన గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేయాలని డెప్యూటీ ఇంజినీర్‌కు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, గ్రంథాలయ అధికారిణి ఎస్.స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.