Share News

పోక్సో కేసులో వ్యక్తికి 25 ఏళ్ల జైలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:57 PM

పోక్సో కేసులో ఒక వ్యక్తికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారిణి కె.నాగమణి శుక్రవారం తీర్పు ఇచ్చారు.

పోక్సో కేసులో వ్యక్తికి 25 ఏళ్ల జైలు

రామభద్రపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఒక వ్యక్తికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారిణి కె.నాగమణి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంఽ దించిన వివరాలను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో విలేకర్లకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది జూలై 13న రామభద్రపురం మం డలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరు నెలల పసిపాపపై ఇదే మండలం జన్నివలస పంచాయతీ నేరెళ్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ భద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును బొబ్బిలి డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే ఈ కేసులో ట్రైల్‌ను పూర్తిచేసి సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో ఎరకన్నదొరకు పోక్సో ప్రత్యేక న్యాయాధికారిణి నాగమణి శిక్ష ఖరారు చేశారు.ఈ కేసులో క్రియాశీలంగా వ్యవహరించిన బొబ్బిలి డీఎస్పీ పోతి రెడ్డి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌.తిరుమలరావు, అప్పటి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌, ప్రస్తుత బొబ్బిలి రూరల్‌ సీఐ కె.నారాయణరావు, ప్రస్తుత రామభద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాదరావు, హెచ్‌సీ వీఎల్‌వీ నారాయణ, కాని స్టేబుల్‌ వై.అప్పలనాయుడు, తెర్లాం ఏఎస్‌ఐ కె.పూడినాయుడు, సీఎంఎస్‌ హెచ్‌సీ రామకృష్ణలను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

Updated Date - Jan 03 , 2025 | 11:57 PM