Share News

spuritutial కన్నులపండువగా పుష్పయాగం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:48 PM

Puspayagam as gloriously బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రెండో రోజు మంగళవారం పుష్పయాగాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ప్రతినిధి, ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో సుమారు ఒకటిన్నర టన్నుల పూలతో శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించారు. స్థానిక కోట నుంచి ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా పూల బుట్టను తలపై మోసుకుంటూ మేళతాళాలతో ఆలయానికి తరలించారు.

spuritutial కన్నులపండువగా పుష్పయాగం
పుష్పయాగ స్థలం వద్ద ఎమ్మెల్యే బేబీనాయన

కన్నులపండువగా పుష్పయాగం

పెద్ద ఎత్తున హాజరైన భక్తులు

బొబ్బిలి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రెండో రోజు మంగళవారం పుష్పయాగాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ప్రతినిధి, ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో సుమారు ఒకటిన్నర టన్నుల పూలతో శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించారు. స్థానిక కోట నుంచి ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా పూల బుట్టను తలపై మోసుకుంటూ మేళతాళాలతో ఆలయానికి తరలించారు. తొలుత దర్బారు మహల్‌లో ఈ పూలకు వేదమంత్రాలతో పూజలు చేశారు. అక్కడి నుంచి 108 వెదురుబుట్టలతో పూలను భక్తులు ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాటితో స్వామి వారికి పుష్ప యాగం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అంపోలు వీరరాఘవాచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యు లు, చామర్తి నరసింహాచార్యులు, భద్రం శ్రీకాంత్‌, కూర్మా చార్యులు, జగదీశ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో పూజలు చేశారు. పుష్పయాగం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మంత్రికి, ఎమ్మెల్యేకు బేబీనాయన స్వామి వారి చిత్రపటాలను బహూకరించారు.

Updated Date - Jan 07 , 2025 | 11:48 PM