Share News

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:23 AM

కొత్తవలసలోని బీసీ హాస్టల్‌ విద్యార్థిని షర్మిల సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కొత్తవలస, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కొత్తవలసలోని బీసీ హాస్టల్‌ విద్యార్థిని షర్మిల సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శృంగవరపుకోటకు చెందిన విద్యార్థిని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతోంది. తనను తోటి విద్యార్థుల్లో కొందరు అవహేళన చేయ డంతో మనస్తాపం చెంది దురదలకు రాసుకునే మందు పాఠశాలలో తాగేసిం ది. విషయం తెలుసుకున్న హెచ్‌ఎం సీహెచ్‌.ఈశ్వరరావు. షర్మిలను తొలుత స్థానిక పీహెచ్‌పీ తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయ నగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షర్మిలతో సీఐ షన్ముఖరావు మాట్లాడారు. తా నే దురదల మందు తాగినట్టు సదరు విద్యార్థిని సీఐకి తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షన్ముఖరావు తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 12:23 AM