Share News

Study with Interest కష్టపడి కాదు..ఇష్టపడి చదవండి

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:37 AM

Study with Interest, Not Struggle కష్టపడి కాదు...ఇష్టపడి చదువుకోవాలని, ప్రతీ విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

Study with Interest కష్టపడి కాదు..ఇష్టపడి చదవండి
విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సంద్యారాణి

సాలూరు జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పఽథకం ప్రారంభం

సాలూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కష్టపడి కాదు...ఇష్టపడి చదువుకోవాలని, ప్రతీ విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా విద్యార్థులకు వడ్డించి.. వారితో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తే.. వైసీపీ ప్రభుత్వ దానికి మంగళం పాడేసింది. కూటమి ప్రభుత్వం విద్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తోంది. మంత్రి నారా లోకేష్‌ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పఽథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే రూ.28 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకం వల్ల జిల్లాలోని 14 జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 5,800 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి సాలూరులో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభిస్తాం. బోధనా విధానాన్ని మెరుగుపరిచేందుకు జిల్లా రీజనల్‌ స్థాయిలో అకడమిక్‌ గైడెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ సెల్‌లను ఏర్పాటు చేస్తాం.’ అని తెలిపారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మధ్యాహ్న భోజన పఽథకం ద్వారా బలవర్థక పౌష్టికాహారాన్ని తీసుకుని విద్యలో రాణించాలన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా వృత్తి విద్య అధికారి వి.మంజుల వీణ, కళాశాల ప్రిన్సిపాల్‌ మురళీధర్‌, టీడీపీ నాయకులు తిరుపతిరావు, చంద్రశేఖర్‌ , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:37 AM