celebration మిన్నంటిన సంబరం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:30 PM
Such a celebration జిల్లా కేంద్రం పార్వతీపురంలో రెండోరోజు ఆదివారం కూడా సంక్రాంతి సంబరాలు కొనసాగాయి. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
భోగి మంటలు వేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
బెలగాం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో రెండోరోజు ఆదివారం కూడా సంక్రాంతి సంబరాలు కొనసాగాయి. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కళాశాల మైదానంలో కలెక్టర్ భోగి మంటలు వెలిగించి.. అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావాసులంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత చిన్నారులపై భోగి పళ్లు వేశారు. ఎడ్ల బండ్ల పోటీలు ప్రారంభించారు. సంక్రాంతి పండగ అంటే సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని అని ఆయన తెలిపారు. సంప్రదాయం ఉట్టిపడేలా జిల్లా కేంద్రంలో సంక్రాంతి వేడుకలు, క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.