artists: కళాకారుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:38 PM
artists: పౌరాణిక కళాకారుల సంక్షేమమే ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. పార్వతీపురంలో ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌరాణిక పద్య ఏకపాత్రాభియ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.
పార్వతీపురంటౌన్, జనవరి 1(ఆంధ్రజ్యోతి):: పౌరాణిక కళాకారుల సంక్షేమమే ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. పార్వతీపురంలో ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌరాణిక పద్య ఏకపాత్రాభియ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంహయాంలో పౌరాణిక కళాకారులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. సీఎం చంద్రబాబు కళాభిమాని కావడం, డిప్యూటీ సీఎం కళాకారుడు కావడంతో త్వరలో పౌరాణిక కళాకారులకు మం చిరోజులు వస్తాయన్నారు. వృద్ధ కళాకారులకు రూ.ఆరువేలు పింఛన్ అందించాలని, ప్రభుత్వానికి కోరుతానని తెలిపారు.తిరుమలతోపాటు సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, విజయవాడ పుణ్యక్షేత్రాల్లో వెయ్యికి తక్కువ కాకుండా పౌరాణిక నాటకాలు ప్రదర్శించాలన్న సంకల్పం పెట్టుకున్నామని చెప్పారు. అకాడమీని కళాకారుల ఉపాధి కల్పనా కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పౌరాణిక నాటకాలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. అనంతరం రంగస్థల నటుడు కె.గున్నేశ్వరరావును వెండి కిరీటంతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పౌరాణిక పద్య నాటక కళాకారుల సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు పల్లి నల్లనయ్య, ఆ సేవా సంఘం అధ్యక్షులు బడే శ్రీరాములు నాయుడు, కార్యదర్శి వి.మారుతీప్రసాద్, కోశాధికారి ఎం.దామోదరరావు, ఉపాఽధ్యక్షులు, పోటీల ఆర్గనైజర్ ఎన్. సింహాచలం పాల్గొన్నారు.