Share News

dont take competation అక్కడ బహిరంగం... ఇక్కడ రహస్యం..!

ABN , Publish Date - Jan 15 , 2025 | 11:58 PM

There is open... here is secret..! గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోనేనా కోడికి కత్తె కట్టేది.. మేము కూడా కట్టగలమంటూ జిల్లా పోలీస్‌లకు పందెం రాయుళ్లు సవాల్‌ విసురుతున్నారు. ఆ జిల్లాల్లో బహిరంగంగా కోళ్ల పందాలు జరుగుతుంటే.. ఇక్కడ రహస్యంగా బరిలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

dont take competation అక్కడ బహిరంగం... ఇక్కడ రహస్యం..!

అక్కడ బహిరంగం... ఇక్కడ రహస్యం..!

పండుగలో బరిలో దిగిన కోళ్లు

జిల్లాలో ఎక్కడికక్కడ కోళ్లకు కత్తి కట్టి పందేలు

డ్రోన్‌లతో నిఘా పెట్టిన బెదరని నిర్వాహకులు

గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోనేనా కోడికి కత్తె కట్టేది.. మేము కూడా కట్టగలమంటూ జిల్లా పోలీస్‌లకు పందెం రాయుళ్లు సవాల్‌ విసురుతున్నారు. ఆ జిల్లాల్లో బహిరంగంగా కోళ్ల పందాలు జరుగుతుంటే.. ఇక్కడ రహస్యంగా బరిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొండలు, మెట్టలు, తోటల్లో ఎక్కడో చోట బరి సిద్ధం చేసేస్తున్నారు. పోలీస్‌లొచ్చేలోపే పని కానిచ్చేస్తున్నారు. పండుగ మూడు రోజులూ జిల్లాలో చాలాచోట్ల గుట్టుగా కోడిపందాలు సాగాయి. పోలీసులు డ్రోన్‌లతో నిఘా పెట్టినా నిర్వాహకులు బెదరలేదు. ఎక్కడికక్కడ కోళ్లకు కత్తి కట్టి పందేలు వేసుకుని సరదా తీర్చుకున్నారు.

శృంగవరపుకోట జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి కొన్ని జిల్లాల పల్లె వాసులకు బాగా అనందాన్నిచ్చే క్రీడల్లో కోడి పందెం ఒకటి. ఏటా ఎక్కడెక్కడో వున్న వారంతా ప్రత్యేంగా వీటిని చూసేందుకే తప్పకుండ ప్రయాణమవుతారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సంసృతి రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలకు కూడా పాకింది. అయితే అక్కడంతా బహిరంగమే. జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్దం. ఇక్కడంతా రహస్యం. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచి పోలీస్‌ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎస్పీ వకుల్‌జిందాల్‌ సాంకేతికను ఉపయోగించి డ్రోన్‌లతో నిఘా పెట్టించారు. ఎక్కడ పేకాట, పందేల స్థావరాలున్నా పట్టేస్తామంటూ ప్రచారం చేయిస్తున్నారు. అయినప్పటికీ కోళ్ల పందెం రాయళ్లు వెనక్కి తగ్గడం లేదు. తమను కనిపెట్టలేరంటూ రహస్య ప్రదేశాల్లో కోడికి కత్తె కట్టేస్తున్నారు. పోలీస్‌ల కళ్లు కప్పి భయంతో కూడిన అనందం పొందుతున్నారు. ఒక వేళ పోలీస్‌లు పట్టుకొనేందుకు ఇటు వైపు వచ్చినా దొరకకుండా దారులను ముందే వెతుక్కుంటు న్నారు. పందెం బరిలకు కిలోమీటరు దూరంలో రహస్యంగా వేగులను పెడుతున్నారు. సివిల్‌ దుస్తుల్లో పోలీస్‌లు వచ్చినా కనిపెట్టేస్తున్నారు. వీరొస్తున్న విషయాన్ని ఫోన్‌ల ద్వారా సమాచారం అందించేస్తున్నారు. బరిల వద్దకు పోలీస్‌లు చేరుకున్న లోపే అక్కడ నుంచి ఊడాయిస్తున్నారు. మరో చోట ముందే సిద్ధం చేసుకున్న మకాం వద్దకు చేరిపోతున్నారు. పోలీస్‌లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

పోలీస్‌లకు కత్తి మీద సామే

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సంక్రాంతితో కోడి పందాలు ముగుస్తాయి. జిల్లాలో మాత్రం సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకు గ్రామాల్లో కనిపిస్తాయి. అంత వరకు ప్రతి రోజు ఏదో ఒక ఊర్లో గ్రామ దేవతల తీర్థాలు జరుగుతాయి. ఒకటి నుంచి మూడు రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. ఈ సమయంలో పేకాట, పందెం తప్పనిసరి. ఇవి ఉంటేనే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. దీంతో తీర్థాలను విజయవంతం చేసుకొనేందుకు గ్రామ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఒకటవుతున్నారు. పోలీస్‌లు గ్రామ దేవతల తీర్థాల వైపు చూడకుండా ఇరు పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నేతలు తమ తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను కలుస్తున్నారు. దీంతో తీర్థాలు ముగిసే వరకు కోడి పందేల నివారణ పోలీస్‌లకు కత్తి మీద సామే.

Updated Date - Jan 15 , 2025 | 11:58 PM