river నదిని తోడుస్తున్నారు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:46 PM
They are crossing the river ఒకవైపు ఉమ్మడి విజయనగరం జిల్లా, మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుగా ఉన్న నాగావళి నదిని అక్రమార్కులు మింగేస్తున్నారు. భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. రాత్రీపగలు నదిని గుల్ల చేస్తున్నారు. వారి ధనదాహానికి నదీ ప్రవాహ దిశ ఇప్పటికే మారిపోయింది. నిబంధనలు కాని, అధికారుల ఆదేశాలు కాని, సహజ వనరును కాపాడుకోవాలన్న ఆలోచన కాని లేకుండా నదిని దోపిడీ చేస్తున్నారు.
నదిని తోడుస్తున్నారు
నాగావళి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు
ఇప్పటికే దిశ మారిన ప్రవాహం
మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్న అధికారులు
ఒకవైపు ఉమ్మడి విజయనగరం జిల్లా, మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుగా ఉన్న నాగావళి నదిని అక్రమార్కులు మింగేస్తున్నారు. భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. రాత్రీపగలు నదిని గుల్ల చేస్తున్నారు. వారి ధనదాహానికి నదీ ప్రవాహ దిశ ఇప్పటికే మారిపోయింది. నిబంధనలు కాని, అధికారుల ఆదేశాలు కాని, సహజ వనరును కాపాడుకోవాలన్న ఆలోచన కాని లేకుండా నదిని దోపిడీ చేస్తున్నారు.
రేగిడి, జనవరి 1,(ఆంరఽధజ్యోతి):
విజయనగరం జిల్లా రేగిడి మండలం బొడ్డవలస, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గోపాలపురం వద్ద నాగావళి నది మధ్యలో ఇసుక దొంగలు తిష్టవేశారు. అనధికార క్వారీలు నిర్వహిస్తూ ఎక్సకవేటర్లతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే నదీలో పెద్దగుంతలు ఏర్పడి నదీప్రవాహ దిశకు ముప్పుతెచ్చారు. అయినా అధికారుల నిఘా ఉండడం లేదు. రెండు జిల్లాల అధికారులు మీనమేషాలు లెక్కించడంపై ఈప్రాంతీయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. విజయనగం జిల్లా యంత్రాంగానికి స్థానిక అధికారులు నివేదిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. మరో సరిహద్దుగా ఉన్న పార్వతీపురంమన్యం జిల్లా యంత్రాంగంలో కూడా దీనిపై ఇసుమంత చలనం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇసుక వ్యవహారం వెనుక పెద్దనేతలు ఉండటంతోనే గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు తవ్వకాలు నివారించలేకపోతున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న విమర్శ.
- నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం ఒకనేరం కాగా మరోవైపు ఈప్రాంతంలో ఏడు మండలాలకు రక్షిత నీరు అందించే రక్షితసోర్స్(ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్) ఉన్నాయి. వాటి చెంతే తవ్వకాలు చేస్తున్నారు. నిరాటంకంగా అక్రమ క్వారీలు సాగిస్తున్నారు. వెల్స్‌కు 500 మీటర్లలోపు క్వారీలు నిషేధమైనా ఇవి అక్రమార్కులకు పట్టడంలేదు. నదీలో ఉన్న పెద్దపెద్దగుంతల వల్ల బొడ్డవలస వద్ద గతంలో నదిలో పలువురు దిగబడిపోయి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు అధికారులు హడావిడి చేయడం తర్వాత వదిలేయడం షరామామూలైపోయింది.
అధికారులకు నివేదించాం
చిన్నారావు, తహసీల్దార్
నాగావళి నది మధ్యలో ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయి అధికారులకు నివేదించాం. బొడ్డవలస పరిధిలో ఇసుక తవ్వకాలు ఇప్పటికే నియంత్రించాం. నది మధ్యలోనూ, ఎక్సకవేటర్లతో రక్షితవెల్స్ దగ్గరలోనూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నమాట వాస్తవమే. అది ఉమ్మడి జిల్లా సరిహద్దుగా ఉంది. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం తమ పరిధికాదని నివేదించాం.