దట్టంగా పొగ మంచు..
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:13 PM
Thick Fog సీతంపేట మన్యంలో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9గంటల వరకు ఇదే పరిస్థితి. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
సీతంపేట రూరల్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9గంటల వరకు ఇదే పరిస్థితి. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. శుక్రవారం కూడా పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వస్తున్నవి కనిపించకపోవడంతో బస్సులు, భారీ వాహనాలను కొంత సమయం పాటు నిలిపివేశారు. ఆటోలు, ద్విచక్ర వాహనదారులు పట్టపగలు హెడ్‌లైట్‌లు వేసుకొని ప్రయాణాలు సాగించారు. మంచుతో పాటు చలి తీవ్రత కూడా పెరగడంతో వాకర్స్, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా మన్యం వాసులు ఉదయం తొమ్మిది గంటల వరకు రోడ్డు పైకి వచ్చేందుకు సాహసించడం లేదు.