Share News

competition నేడే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:22 PM

Today is the 'Andhra Jyoti-ABN' pearl trio competition సంక్రాంతి సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది. ‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలకు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’’ సహకారం అందించ నున్నాయి.

competition నేడే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’   ముత్యాల ముగ్గుల పోటీలు
సిద్ధమైన ఎయిమ్‌ స్కూల్‌ మైదానం

నేడే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’

ముత్యాల ముగ్గుల పోటీలు

విజయనగరం తోటపాలెంలోని ఎయిమ్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ఆవరణంలో నిర్వహణ

విజేతలకు భారీగా నగదు పురస్కారాలు

విజయనగరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది. ‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలకు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’’ సహకారం అందించ నున్నాయి. మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని.. అందమైన ముగ్గులు వేసి.. ఆకర్షణీ యమైన బహుమ తులను గెలుచుకోవాలని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ పిలుపునిస్తోంది. విజయనగరం తోటపాలెం లోని ఎయిమ్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ఆవరణంలో ఈనెల 4న ముగ్గుల పోటీలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఆకర్షణీయమైన మూడు ముగ్గులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసి విజేతలకు బహుమతులతోపాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేతకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4వేలు, తృతీయ విజేతకు రూ.3వేలతోపాటు మెమొంటోలు ఇస్తారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు కన్సొలేషన్‌ బహుమతులు కూడా అందజే స్తారు. ముగ్గుల పోటీలకు స్థానిక స్పాన్సర్‌గా ఎయిమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూ షన్స్‌ వ్యవహరిస్తోంది. న్యాయ నిర్ణేతలుగా వివిధ రంగాలకు చెందిన మహిళలు గ్రంథి శీరిషా, కల్పనా కుక్రేజా, వజ్రపు మాధవితో పాటు అవనాపు భార్గవి వ్యవహరిస్తున్నారు. వీరు ముగ్గులను పరిశీలించి నిబంధనల మేరకు మార్కులు వేయనున్నారు. ముఖ్య అతిథులుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, చింతలవలస బెటాలియన్‌ కమాండెంట్‌ మలికాగార్గ్‌, ప్రముఖ స్ర్త్రీ వైద్య నిపుణురాలు డాక్టరు సన్యాసమ్మ హాజరై మహిళలకు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ విజేతను ఈ నెల 11న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో ఏకంగా రూ.1.50 లక్షల విలువైన బహుమతులను గెలుచుకోవచ్చు.

ఇవీ నిబంధనలు..

ముగ్గుల పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కేవలం చుక్కల ముగ్గులను మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసల్లో ముగ్గు వేస్తున్నారో న్యాయనిర్ణేతలకు స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం కేవలం రెండు గంటలు మాత్రమే. ముగ్గు చేతితోనే వేయాలి. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించకూడదు. జల్లెడ ఉపయోగించేందుకు అనుమతి ఉంది. ముగ్గుల్లో గొబ్బెమ్మలను, బతుకమ్మలను అమర్చుకోవచ్చు.. అదనపు ఆకర్షణ కోసం ఇతరత్రా వస్తువులను వాడకూడదు.

మైదానం సిద్ధం

ఎయిమ్‌ స్కూల్‌ మైదానం ముత్యాలముగ్గుల పోటీలకు సిద్ధమైంది. పోటీలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా బొబ్బిలి, నెల్లిమర్ల, గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, గరివిడి, చీపురుపల్లి, ఎస్‌కోట, జామి, గంట్యాడ తదితర ప్రాంతాల నుంచి మహిళలు తరలిరానున్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:22 PM