Share News

ఖాళీ స్థలాలను పేదలకు అప్పగించాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:14 AM

ఖాళీస్థలా లను నిరుపేదలకు అప్పగించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఖాళీ స్థలాలను పేదలకు అప్పగించాలి

బొబ్బిలి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఖాళీస్థలా లను నిరుపేదలకు అప్పగించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీలో గత ప్రభుత్వహయాంలో ఖాళీ స్థలాల కబ్జా, అక్ర మ వ్యాపారాలపై అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఇందిరమ్మకాలనీలో నిర్వ హించిన కార్యక్రమంలో సీపీఐ నాయ కులు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్‌ తదితరులు మా ట్లాడారు. నకిలీ పట్టాలను సృష్టించి, పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసి లక్షలాది రూపా యల వ్యాపారాలను అక్రమ వ్యాపారాలను సాగించిన వారిపై అధికార యంత్రాంగం ఎం దుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ప్రతిసారీ మొక్కు బడిగా ఒకటి రెండు చిన్నపాటి రేకుల షెడ్లను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు చొరవతీసుకొని నకిలీ పట్టాల జారీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 06 , 2025 | 12:14 AM