Share News

సంక్షేమం.. అభివృద్ధితో సుపరిపాలన

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:41 PM

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలుగా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపలన సాగిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నూతన సంవత్సరం పురష్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేసారు.

సంక్షేమం.. అభివృద్ధితో సుపరిపాలన
అశోక్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌

సంక్షేమం.. అభివృద్ధితో సుపరిపాలన

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలుగా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపలన సాగిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నూతన సంవత్సరం పురష్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో రాష్ట్రప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో అందరం ప్రజల ఆశలు నెరవేర్చేలా అహర్నిశలూ పనిచేస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగ అవకాశం కల్పించే దిశగా బాటలు వేస్తున్నామన్నారు. పేదవారి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్‌ల మొత్తాన్ని పెంచడమే కాక ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్‌లు అందజేస్తున్నామన్నారు. ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో గుంతలు లేని రహదార్లను వేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేశాక నగదును 48 గంటల్లో రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్‌ రాష్ట్రంలో అన్ని రంగాలనూ నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. తొలుత విజయనగరంలో అశోక్‌గజపతిరాజును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Jan 01 , 2025 | 11:41 PM