Godadevi: వైభవంగా గోదాదేవికి పూజలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:51 PM
Godadevi: సాలూరు లోని కల్యాణ వేంక టేశ్వర స్వామి ఆలయంలో ధను ర్మాస 17వ రోజు పురస్కరిం చుకుని బుధవారం తిరు ప్పావై పూజను వైభవంగా నిర్వహించారు. గోదారంగ నాథస్వామికి ప్రత్యేక పూజలు, అర్చన,సేవాకాలం, పల్లకిసేవనురుత్వికులు నారా యణాచార్యులు, ఉదయ భాస్కరాచార్యులు శాస్త్రోక్తంగా చేశారు. పెదకోమటిపేటలో రంగనాథుడు,గోదాదేవిలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
సాలూరు రూరల్, జనవరి 1 ఆంధ్రజ్యోతి): సాలూరు లోని కల్యాణ వేంక టేశ్వర స్వామి ఆలయంలో ధను ర్మాస 17వ రోజు పురస్కరిం చుకుని బుధవారం తిరు ప్పావై పూజను వైభవంగా నిర్వహించారు. గోదారంగ నాథస్వామికి ప్రత్యేక పూజలు, అర్చన,సేవాకాలం, పల్లకిసేవనురుత్వికులు నారా యణాచార్యులు, ఉదయ భాస్కరాచార్యులు శాస్త్రోక్తంగా చేశారు. పెదకోమటిపేటలో రంగనాథుడు,గోదాదేవిలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
సాలూరు రూరల్, జనవరి 1 ( ఆంధ్రజ్యోతి ): సాలూరులోని సంతోషి మాత, కామాక్షి,కల్యాణ వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాలకు నూతన సంవత్సరం పురస్కరించుకుని బుధవారం తెల్లవారు జాము నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కామాక్షి ఆలయంలో వినాయకుడు, ఏకామ్రనాథుడులకు పుష్పాలంకరణ చేశారు. అమ్మవారికి స్వర్ణవర్ణ కిరీటం, హస్తాలు తదితర వాటితో విశేష అలంకరణ చేశారు.
దేవ్‌మాలిలో పర్యాటకుల సందడి
సాలూరు రూరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని కొఠియా కొండల్లో గల దేవ్‌మాలి పర్వతం వద్దకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉల్లాసంగా గడపడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దేవ్‌మా లిని ఒడిశా పర్యాటకంగా అభివృద్ధి చేసిన విషయం విదితమే. ప్రస్తుతం దేవ్ మాలి పర్యాటకప్రాంత బాధ్యతలను కొఠియా పంచాయతీ పరిధిలోగల గెమ్మెల పొదర్ మహిళా సంఘానికి అప్పగించారు. ఒడిశా పర్యాటక శాఖ దేవ్‌మాలిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో కొద్దిరోజులుగా పర్యాటకులు పోటెత్తుతు న్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన పారాచూట్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.