జోడీలు కావలెను!
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:24 AM
సంక్రాంతి వస్తోంది. కోడి పందేలకు పశ్చిమలో బరులకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
జోడీల వేటలో పందేల నిర్వాహకులు
పెంచిన కోళ్లకు వైరస్ సోకడంతో కథ మొదలు
ఈ ఏడాది నాలుగు చోట్ల భారీ బరులకు సన్నాహాలు
ఇప్పటికే నిండుకున్న లాడ్జీలు
తాడేపల్లిగూడెం రూరల్/నరసాపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వస్తోంది. కోడి పందేలకు పశ్చిమలో బరులకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఇంక కావాల్సింది పుంజులు. వాటిని ముందుగానే సిద్ధం చేసుకున్న నిర్వాహకులకు వైరస్ వల్ల పుంజులు మృత్యువాత పడటంతో జోడీల కొరత నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. దీంతో నిర్వాహకులంతా జోడీల కోసం జల్లెడ పడుతున్నారు. ఏ నిర్వాహకుడికి ఎన్ని జోడీలు ఎక్కువ దొరికితే ఆ బరి రసవత్తరంగా మారుతుందని పందెం రాయుళ్లు ఆ బరికి క్యూ కడతారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. దీంతో ఎక్కువ జోడీలను సొంతం చేసుకునేందుకు లక్షలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. ఆరు నెలల ముందు నుంచి పందాల నిర్వాహకులు పుంజులను ఎంపిక చేసుకుని ఆ పుంజుల పెంపకందారులకు ముందస్తుగా మేతకు సొమ్ములు ఇచ్చి బుక్ చేసుకునే ఆనవాయితీ మొదటి నుంచి ఉంది. అయితే ఈ ఏడాది ఎప్పటిలాగే పుంజుల పెంపకందారులకు మేతను నిర్వాహకులు భరించారు. అయితే పందాలు దగ్గర పడే సమయంలో పుంజులు వైరస్ బారినపడి మృత్యువాత పడటంతో నిర్వాహకులు ఆందోళనలో పడిపోయారు.
బరికి రోజుకు 50 నుంచి 100 జోడీలు
బరి వేయాలంటే ముందు పందెగాళ్లను ఆకట్టు కోవాలి. ఆ పందెగాళ్లను ఆకట్టుకునేందుకు సరిజోడీలను రంగంలోకి దింపాలి. దింపిన జోడీలపై పందెగాళ్లు వేసే పందేలపైనే పండగ సంబరం పెరుగుతుంది. బరివేయా లనుకునే నిర్వాహకులు ఏడాది ముందుగానే జోడీలను సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల వచ్చిన మార్పులతో పెంచుకున్న జోడీలు కాస్త ఖాళీ కావడంతో వారిలో జోడీల గుబులు మొదలైంది. దీంతో రోజుకు 50 నుంచి 100 జోడీలు లెక్కలేసి పందెం పుంజుల పెంపకందారులకు లక్షల్లో అడ్వాసులు ఇచ్చి మరీ సిద్ధ్దం చేసుకుంటున్నారు. దీంతో పందెం పుంజుల పెపకం దారులకు గిరాకి పెరిగింది.
తీరంలో కోడి పందేలకు సై...?
ఈ ఏడాది కోడిపందేలను భారీగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న బరులే ఉండేవి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే పందేంరాయుళ్ళ సంఖ్య తక్కువు గానే ఉండేది. అయితే ఈసారి సీన్ మారుతోంది. నాలుగు చోట్ల భారీ బరులు నిర్వహించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈ నలుగురు నిర్వాహకులు పోటా పోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక బరి నిర్వా హకుడు మాత్రం పందేంరాయుళ్లను అకర్షించేందుకు దాదాపు రూ.50లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవుతు న్నట్టు సమాచారం. బయట ప్రాంతాల నుంచి దాదాపు పందెంరాయుళ్లను రప్పిం చడంతో పాటు పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే పందెంరాయుళ్ళ కోసం ఇప్పటికే ఈ నిర్వాహకులు రూమ్‌లన్ని బుక్ చేసేశారు. మూడు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందులో బరిలతోపాటు వేదికలు, కార్ పార్కింగ్‌కు కూడా ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్వాహకుడి ఏర్పాట్లను తెలు సుకున్న మిగిలిన ముగ్గురు దీటైనా ఏర్పాట్లకే సిద్ధమ వుతున్నారు. ఇందులో ఒక బరిని పాలకొల్లు రోడ్, మరో బరి లక్ష్మణేశ్వరం, మరొకటి మొగల్తూరులో ఏర్పాట్లు జరగు తున్నాయి. గతంలో గ్రామాల్లో చిన్న చిన్న బరు లు ఉండేవి. ఈసారి పెద్ద బరులు వస్తుండటంతో చిన్న బరులకు పందేంరాయుళ్లు వస్తారా లేదా అన్న సందేహం నిర్వాహకుల్లో నెలకొంది.
కోడి పందేల బరులు ధ్వంసం
పోలవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ గ్రామంలో గురువారం కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులను తహసీల్దారు సాయిరాజు, ఎస్‌ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సరదాగా రూ. కోటి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కోడి పందేలకు జిల్లాలో నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అతిథులు విచ్చేస్తున్నారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు ఉబలాటపడుతున్నారు. తాడేపల్లిగూడెంలోని ఓ తోటలో నిర్వహి ంచే బరికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకు ంటున్నారు. కోడి పందేల్లో పేరుమోసిన ఓ యజమాని తన కోళ్లతో తాడేపల్లిగూ డెం రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. మూడు రోజులపాటు పాల్గొంటున్నారు. అతని పేరు రత్తయ్యగా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా సై అంటే మూడు రోజుల్లో ఒక పందాన్ని కోటి రూపాయల వరకు కాయనున్నట్టు ప్రకటించారు. ఎప్పటినుంచో తన మనస్సు లో ఉన్న మాటను ఆయన బయట పెట్టా రు. సొంత కోళ్లను పందేల కోసం పెంచు కుంటున్నారు. వాటితో తాడేపల్లిగూడెంలో పందేల కోసం రానున్నట్టు సోషల్ మీడి యాలో ప్రకటించారు. అదే ఇ ప్పుడు పందెగాళ్లలో ఆసక్తి రేపుతోంది. మరోవైపు భీమవరం, ఉండి. గణపవరం, నర్సాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో భారీ బరలు వేసేందుకు కసరత్తు పూర్తయ్యింది.