ఆశలు.. ఆకాంక్షలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:47 AM
కొత్త ఏడాది ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. వీటి వెంటే సరికొత్త సవాళ్లు. ఉచితంగా బస్సు ఎక్కాలని మహిళలు. వందనం కోసం తల్లి ఎదురుచూపులు. ప్రాజెక్టు పనులన్నీ కొలిక్కిరావాలని, గతం కంటే మరింత సంతృప్తిగా పంట, దిగుబడి, ధర చేతికందాలని రైతులు. నామినేటెడ్ కుర్చీకోసం నేతలు. చదువులో రాణించాలని విద్యార్థులు.
కొత్త ఏడాది సరికొత్త లక్ష్యాలెన్నో
కూటమి ప్రభుత్వానికి సవాళ్లు
సంస్కరణలకు నాంది కావాలి
సాగు, తాగునీటికి ముందస్తు ప్రణాళిక
నూతన విజయాలకు
అంకురార్పణకు ఇదే సమయం
కొత్త ఏడాది ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. వీటి వెంటే సరికొత్త సవాళ్లు. ఉచితంగా బస్సు ఎక్కాలని మహిళలు. వందనం కోసం తల్లి ఎదురుచూపులు. ప్రాజెక్టు పనులన్నీ కొలిక్కిరావాలని, గతం కంటే మరింత సంతృప్తిగా పంట, దిగుబడి, ధర చేతికందాలని రైతులు. నామినేటెడ్ కుర్చీకోసం నేతలు. చదువులో రాణించాలని విద్యార్థులు. కొత్తకొత్త ప్రయోగాలతో కూటమి ప్రభుత్వం.. ఈ దిశగానే నూతన అధ్యాయం దిశగా అడుగులు. మహిళలకు పోలీసుల రక్షాకవచం. సైబర్ నేరాలకు కళ్లెం. జిల్లాలో అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రాలు. పేకాట దగ్గర నుంచి కోడి పందేలు వరకు కట్టడి. శాంతి.. భద్రతకే అత్యధిక ప్రాధాన్యం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొ ఆశ. రాబోయే 365 రోజులు వచ్చిపడే ఉపద్రవాల నుంచి ప్రజలను రక్షించడం, ఒత్తిడి తగ్గించడం, ఆర్థికంగా వెసులుబాటు కల్పించ డం, రాజకీయాల్లో సమున్నతంగా వ్యవహరించేలా నేతలకు దిశ, దశ నిర్దేశించడం ఈ ఏడాదే అన్ని పార్టీల ముందున్న లక్ష్యాలు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఆంగ్ల సంవత్సరానికి అంతటా జేజేలు. గత అనుభవాల క్రీనీడల నుంచి సరికొత్త వెలుగులు తెచ్చే కొత్త సంవత్సరానికి స్వాగతం. ఏడాది పొడుగునా సరికొత్త లక్ష్యాలను చేరుకోవాలని. అందరి ఆకాంక్ష ఇదే. ఇప్పటి నుంచే సరికొత్త పాఠాలు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలు రాణించేలా కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. గత ఏడాది ఒక్కొక్కటిగా సంస్కరణలు చేస్తూ, పాత వాసనలు వదిలిస్తూ, ఒక్కొ అడుగు ముందుకేస్తూ కొత్త ఏడాదిలోకి కూటమి ప్రభుత్వం అడుగు పెడుతోంది. ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 ఇప్పటికీ అందరి నోట నానుతోంది. మిగతా రాష్ట్రాలకు ధీటుగా పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడం ఒక ఎత్తయితే.. దానిని ఠంచన్‌గా అందించడం మరో ఎత్తు. అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్కొ పథకాన్ని లైన్‌లో పెట్టి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడం మరొక ఎత్తు. సూపర్–6లో భాగమైన మహిళలు ఉచిత ఆర్టీసి ప్రయాణం వంటి వాటికి ఈ ఏడాదే అంకురా ర్పణ జరగబోతుందని ఆశ. వీటితోపాటు ఇతర హామీల అమలుకు మహిళలు, ఇతర వర్గాలు ఎదురుచూస్తు న్నాయి. కూటమి ప్రభుత్వ చర్యలతో మార్పును ఇప్పటికే స్వాగతిస్తూ వస్తున్న వారంతా పథకాల అమలులో వేచి చూసే ధోరణిలోనే ఓర్పు. విద్యా సంస్కరణల్లో కూటమి ఇప్పటికే తొలి అడుగు వేసింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలులోకి వచ్చింది. దీనికితోడు పాత విధానాలను మార్చి చదువుల్లో నిలదొక్కుకునేలా అటు ఉపాధ్యాయ వర్గానికి, ఇటు విద్యార్థి లోకానికి సరికొత్త బాటలే స్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే సంస్కరణల ప్రభావం ఉండేలా జాగ్రత్తపడుతోంది. విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్‌ల దగ్గర నుంచి అన్నింటా జాగ్రత్త పడుతుంది. కొత్త జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టాల్సి ఉంది. పక్కాగా ప్రణాళిక, అమలు ఇప్పటి లక్ష్యాలు. వీటిని అందుకోవడానికే అందరిదీ ఆతృతే. వీటిలో సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు సర్కార్ సాహసిస్తోంది. ఇంకోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ను సంతృప్తిపరిచేలా గడిచిన ఐదేళ్ల లోపాలను ఒక్కొ క్కటిగా సవరించాల్సి ఉంది. వీటిలో పాత బకాయిలను కొంతలో కొంత సర్దుబాటు చేయాలి. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా వీటిని దారిలో పెట్టాల్సిన సవాల్ సర్కార్‌దే. పీఎఫ్ నుంచి డీఏ వరకు లక్షల్లో పేరుకుపోయిన బకాయి కోసం వేతన జీవులంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలోను పెను మార్పులకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవ సరం ఉంది. ఇప్పటికే బదిలీల పేరిట పాత వాసనలను దూరంగా ఉంచారు. కొన్నింటిలో మాత్రం ఆ వాసన ఇంకా పోలేదు. రాజకీయ జోక్యం, పక్షపాతం కొందరిలో సమసిపోలేదు. అందరికీ సమన్యాయం చేయాలనేదే ఉద్యోగ ధర్మం కాగా, దీనికి విరుద్దంగా వ్యవహరించే వారికి ఓ షాక్ ఇవ్వాలి. ఈ ఏడాది యంత్రాంగంలో పెను మార్పులకు ఇదే అతి పెద్ద సంకేతం అయ్యేటట్టు చూడాలన్న సర్కారు ప్రభుత్వం వైపు ఉంది. జిల్లా కేంద్రంలో ప్రతీ సోమవారం సాగే వినతుల స్వీకరణ ఆర్డీవో, మునిసిపల్ కేంద్రాలకు విస్తరించాలని తలపె ట్టారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు ఇదొక పెద్ద వెసులుబాటు. పెన్షన్లు, సొంత గృహాలు, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం వేలాది మంది ఎదురుచూపులు. టిడ్కో ఇళ్లు ఎవరి సొంతం చేస్తారో సర్కారు నిర్ణయించేది ఈ ఏడాదే. ఇప్పటికే బోగస్ పెన్షన్ల పరిశీలన పూర్తయ్యింది. ఒక రేషన్‌కార్డులోనే చేర్పులు, మార్పులకు అవకాశం. ఈ మూడింటిలో ప్రభుత్వ కీలక నిర్ణయానికి అవకాశం. కొత్త రోడ్ల నిర్మాణమే కాకుండా గుంతలు తేలిన రోడ్లకు ఇప్పటికే మరమ్మతులు కొలిక్కి వస్తున్నాయి. సంక్రాంతి లోపే గుంతలు రహిత రాష్ట్రంగా ఉండాలన్న సీఎం చం ద్రబాబు ఆశయం నెరవేరడానికి సమయం వచ్చింది.
రాజకీయ సవాళ్లెన్నో..
ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా వీటిని అమలు చేయడం కూటమి ప్రభుత్వా నికి ఈ ఏడాది సరికొత్త సవాల్. ముఖ్యంగా జనం ఏ వైపు మొగ్గు చూపుతున్నారో ఆ దిశగానే అడుగులు కదపాల్సిన అవసరం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల తొలగింపు ఈ ఏడాదైనా జరుగు తుందనే ఆశతో అనేక మంది ఉన్నారు. ఈ కేసుల్లో భాగంగా కోర్టుల చుట్టూ తిరిగి కష్టాలు పడుతున్న వారంతా తమను గట్టెక్కించాలనే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి పార్టీ కోసం కష్టపడిన వారంతా తమకు గౌరవప్రదమైన నామినేటెడ్ పదవి దక్కాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాదిలోనే మార్కెట్ కమిటీలు, సహకార కమిటీలు కూడా ఒక కొలిక్కి రాబో తున్నాయి. వీటికి తోడు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో నామినే టెడ్ పదవుల కోసం క్యూ కట్టిన అనేక మంది కుర్చీ తమకే దక్కుతుందని ఆశతో కంటున్న కలలు సాకారం కావాలనుకుంటున్నారు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ ఇప్పటికే బలపడి ఉండగా, వైసీపీ నిలదొక్కుకోవడానికి ఈ ఏడాది మరిన్ని ప్రయత్నాలు చేయబోతుంది. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో దెబ్బతిని దిగాలు పడింది. రాజీనామాలతో పార్టీలో చాలా వెలితి కనిపిస్తోంది. దీని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అస్త్రశస్త్రాలకు ఈ ఏడాది పదును పెట్టాలని తెగ ఆరాటపడుతుంది. అంతో ఇంతో పాత వాసనలతో నెట్టు కొస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఈ ఏడాదైనా కలిసొస్తుందని ఆశలు పెంచుకున్నాయి.
తాగు, సాగు నీరు
ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది తాగు, సాగునీటి కటకట ఏర్పడకుండా లక్ష్యాలు నిర్దేశించాలి. ఇప్పటికే సాగునీటి సౌక ర్యం మెరుగుపరిచే దిశగా సర్కార్ వేగం పెంచాలి. రెండో పంట గట్టెక్కేలా, రాబోయే ఖరీఫ్ సరైన సమయంలో ఆరంభమయ్యేలా చ ర్యలకు దిగాలి. రైతుకు సరైన దిగు బడి రావడమే కాకుండా మార్కెట్‌లో ధర వరలు సంతృప్తికరంగా ఉండేలా చూసే బాధ్యత సర్కారుదే. ఈఏడాది పత్తి, మిరప, పొగాకు, పామాయిల్, వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఉద్యాన పంటల ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్రాల నుంచి మరింత ప్రోత్సాహకాలు అందేలా చర్యలు ఉండాలి. పోలవరం ప్రాజెక్టుతోపాటు చింతల పూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు ఓ కొలిక్కి రావాలి. మిగిలిన రిజర్వాయర్లలో సాగునీటి నిర్వహణ పద్ధతులు రావాల్సిందే. తాగునీటి అవసరాలను గుర్తిం చి ఆ మేరకు ముందస్తుగా జనవరిలోనే రంగం సిద్ధం చేయాలి. పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తం కావాలి. కుళాయి నీరు కల సాకారమవ్వాలి. రైతు కూలీలకు ఉపాధి హామీ మరింత ఊతమివ్వాలి. ఇవన్నీ చేయా లంటే సర్కారుతోపాటు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని విజయాలు సాధించాలి.
కేంద్రం ఓ చూపు చూడాలి
జిల్లాలో కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైను నిర్మాణం ఈ ఏడాదే ఆరంభమయ్యేలా ప్రత్యేక ప్రణా ళిక రూపొందించాలి. ఇది ఒక కొలిక్కి వస్తే జిల్లాలో రవాణా రంగంలోనే సరికొత్త ఒరవడికి పునాది పడబోతుంది. ఇంకోవైపు గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తి చేయా ల్సి ఉంది. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా అందించాలనే డిమాండ్ ఉంది. సూర్యఘర్ పేరిట సౌర విద్యుత్ జిల్లా అంతటా విస్తరించాల్సిన సమయమిది. ఈ దిశగానే ద్వారకాతిరుమలలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు. ఇంకోవైపు బ్యాంకులు ఊతమిస్తే గృహ సముదాయా లపై సౌర శక్తికి మరింత చేయూతనిచ్చిట్టవుతుంది. పంటలకు కనీస ధర కల్పించడంలో గోధుమ పంట మాదిరిగానే వరి, ఇతర పంటలకు ఈసారి ధర పెరిగేలా కేంద్ర సహకారం అవసరం.