ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి కృషి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:32 AM
ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంగళవారం వినతులు స్వీకరిం చారు.
ఏలూరుటూటౌన్, జనవరి7 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంగళవారం వినతులు స్వీకరిం చారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామ న్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమ న్నారు. ప్రజా సమస్యల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో వస్తున్నారని వీరందరికి సీఎం రిలీ ఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తా మన్నారు. సీహెచ్ వెంకటరత్నం, కిషోర్ పాల్గొన్నారు.
మాలల భవనానికి సహకరిస్తాం..
జన్మభూమి పార్కువద్ద భవన నిర్మాణా నికి చెందిన స్థలాన్ని మంగళవారం మాల సోదరు లతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి తనవంతు సహకారం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొ రేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనే యులు, చాగంటి సంజీవ్, డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్, నూకపేయి సుధీర్‌బాబు, పళ్ళేం ప్రసాద్, శామ్యూల్, మాణిక్యాలరావు, జాలా బాలాజీ, గుడిపూడి రవి, చెక్కుల బెనర్జీ, మెండెం ఆనంద్, దాసరి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.