Share News

హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవగాహన ర్యాలీ

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:35 AM

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవ గాహన ర్యాలీని ఏలూరు రెడ్‌క్రాస్‌ వలంటీర్లు ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి ఫైర్‌స్టేషన్‌ మీదుగా పలు ప్రాంతాల్లో మంగళవారం ర్యాలీ నిర్వహించారు.

హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవగాహన ర్యాలీ
ఏలూరులో రెడ్‌క్రాస్‌ వలంటీర్ల ర్యాలీ

ఏలూరు క్రైం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవ గాహన ర్యాలీని ఏలూరు రెడ్‌క్రాస్‌ వలంటీర్లు ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి ఫైర్‌స్టేషన్‌ మీదుగా పలు ప్రాంతాల్లో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ ఛైర్మ న్‌ బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఎంటీవీ వైరస్‌పై భయపడాల్సిన అవసరం లేదని ఈ వైరస్‌పై అవగాహన కల్గి మాస్క్‌లు ధరించ డం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటివి చేస్తే సరిపోతుందన్నారు. రెడ్‌క్రాస్‌ సభ్యుడు ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ అందరూ కలిసి సమష్టిగా జాగ్రత్తలు పాటిస్తే హెచ్‌ఎంటీవీ వైరస్‌ వ్యాప్తిని అరికట్టవ చ్చన్నారు. రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కేబీ సీతారామ్‌, టి.రామారావు, డీఆర్‌ సీహెచ్‌ నారాయణ, డాక్టర్‌ జి.స్పందన, పీఆర్వో కేవీ రమణ, రెడ్‌క్రాస్‌ నర్సింగ్‌ విద్యార్థినులు, ట్యూటర్లు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:35 AM