కిక్.. దిగిపోయింది
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:25 AM
జానీవాకర్ మద్యానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దీని విలువ ఎనిమిది వేల వరకు ఉంటుంది. కాని భీమవరంలో మూడు వేలకే అమ్ముతు న్నారు. నేరుగా తమిళనాడు నుంచి తెప్పిస్తు న్నామని, అక్కడ ఇంతకంటే తక్కువకు వస్తుందని చెప్పి విక్రయిస్తున్నారు.
జానీవాకర్ పేరిట ఎనిమిది వేల మద్యం బాటిల్ మూడు వేలకే..
భీమవరంలో మూడేళ్లుగా అమ్మకాలు..
తమిళనాడు నుంచి దిగుమతి.. సంక్రాంతి వేళ భారీగా ఆర్డర్లు
నిఘా పెట్టిన ఎక్సైజ్.. ఇద్దరి అరెస్ట్..
అది నకిలీ సరుకని తేల్చిన అధికారులు
హానికర రసాయనాలు ఉన్నట్టు అనుమానం
జానీవాకర్ మద్యానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దీని విలువ ఎనిమిది వేల వరకు ఉంటుంది. కాని భీమవరంలో మూడు వేలకే అమ్ముతు న్నారు. నేరుగా తమిళనాడు నుంచి తెప్పిస్తు న్నామని, అక్కడ ఇంతకంటే తక్కువకు వస్తుందని చెప్పి విక్రయిస్తున్నారు. ఎలాగూ సంక్రాంతి కావడంతో భీమవరంలో మద్యపాన ప్రియులు పెద్ద సంఖ్యలో ఈ బాటిల్స్‌కు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. విషయం ఈ నోట.. ఆనోటా ఎక్సైజ్ అధికారుల చెవిలో పడింది. అంత ఖరీదైన మద్యం మూడు వేలకు ఎలా ఇస్తున్నారా ? అని ఆరా తీశారు. నిఘా వేస్తే.. జానీవాకర్ పేరిట నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేసి నిజాలు రాబట్టారు. లభ్యమైన బాటిళ్ల శ్యాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపారు. ఈ విషయం తెలియ డంతో ‘ఇన్నాళ్లు మనం తాగింది నకిలీ మద్యమా..’ అంటూ ఇది సేవించిన వారు అవాక్కవుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం కేంద్రంగా సాగుతున్న అక్ర మ మద్యం అమ్మకాల గుట్టురట్టయ్యింది. తమిళనాడు నుంచి రహస్యంగా తెచ్చి.. తక్కువ ధరకు బ్రాండెడ్ రకాల పేరిట అమ్ముతున్న మద్యం నకిలీదని తేలింది. ఈ నిర్వాకానికి గత వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీనే కారణమని భావిస్తున్నా రు. జానీవాకర్ మద్యం అంటే మద్యపాన ప్రియులకు ఓ పులకింత. ఈ ప్రాంతంలో బ్రాండెడ్ రకాలపైనే మోజు ఎక్కువ. వైసీపీ హయాంలో బ్రాండెడ్ రకాలు లేకపోవడం, నాసి రకం మద్యాన్నే విక్రయించడంతో దీని ని మాఫియా సొమ్ము చేసుకుంది. ఇతర రా ష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసు కుని భీమవరం కేంద్రంగా విక్రయాలు సాగించింది. ఏలూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనూ దీనిని విస్తరించారు. ఈ క్రమంలో మూడేళ్లుగా మద్యం అమ్మ కాల్లో టర్నోవర్ చేరుకోవడం కష్టమయ్యేది. ఇతర రాష్ర్టాల్లో మద్యం అమ్మకాలు పెరు గుతూ ఉంటే పశ్చిమలో లక్ష్యాన్ని చేరుకో లేకపోయారు. ఆక్వా రంగం, వరి సాగు దెబ్బతినడంతో అమ్మకాలు తగ్గాయంటూ ఎక్సైజ్ అధి కారులు అంచనా వేస్తూ వచ్చారు. ఉన్నతాధికారుల సమీక్షలోనూ ఇదే విషయాన్ని చెప్పే వారు. అయినా రాష్ట్ర స్థాయిలో నమ్మ శక్యం అయ్యేది కాదు. అయినా సరే ఏమీ చేయలేని పరిస్థితి. న్యూ ఇయర్, సంక్రాంతి వచ్చిందంటే పాలకొల్లు ప్రాంతంలో చండీఘడ్ నుంచి మద్యం దిగుమతి చేసి విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి వైసీపీ నేతల అండదండలతో జోరు గా పన్ను లేని మద్యం అమ్మకాలు సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా అక్రమ రవాణా ఆగలేదు. ప్రస్తుతం మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్‌లు లభ్యమవుతున్నాయి. అయినా సరే మాఫియా తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం అంది స్తామని భారీగా ఆర్డర్లు తీసుకుంటున్నది. దీనిపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు. గురువారం విజయవాడ నుంచి వస్తున్న ఓ కారులో 26 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్య డీలర్ భీమవరానికి చెందిన కొమ్మిశెట్టి వెంకటే శ్వరులుగా గుర్తించారు. మద్యాన్ని తరలించిన డ్రైవర్‌తో పాటు, కారును సీజ్ చేశారు. కె.కాళేశ్వరరావు, కె.వెంక టేశ్వరరావు ఉన్నారు. వీరిని విచారిస్తే విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. జానీవాకర్‌లో ఉన్న రెడ్, బ్లాక్, గోల్డ్ లేబుల్ మద్యం బాటిళ్లు పేరిట నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకుం టున్నట్టు తేలింది. ఇతర రాష్ర్టాల నుంచి వీటిని ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో తెప్పిస్తు న్నట్టు చెప్పారు. హానికర రసాయనాలు మిశ్రమం చేసి బ్రాండెడ్ రకాల పేరుతో విక్ర యిస్తున్నట్టు గుర్తించారు. ఈ మద్యం శాంపి ల్స్‌ను పరీక్షల నిమిత్తం లాబ్‌కు పంపినట్టు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికా రులు చెబుతున్నారు. లైసెన్స్ ఉన్న బార్లు, షాపుల్లోనే మద్యం కొనుగోలు చేయాలని సూ చిస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉ న్నారని, వారిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.