త్వరలో నవోదయం 2.0కు శ్రీకారం : ఎక్సైజ్ ఎస్పీ
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:43 AM
డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలో నవోదయం 2.0 నాటుసారా నిర్మూలన కార్యక్రమానికి శ్రీకా రం చుడతామని జిల్లా ఎక్సైజ్ సూపరిం టెండెం ట్ (ఎస్పీ) ఆవులయ్య తెలిపారు.
ఏలూరు క్రైం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలో నవోదయం 2.0 నాటుసారా నిర్మూలన కార్యక్రమానికి శ్రీకా రం చుడతామని జిల్లా ఎక్సైజ్ సూపరిం టెండెం ట్ (ఎస్పీ) ఆవులయ్య తెలిపారు. జిల్లాలో 140 నాటు సారా గ్రామాలను గుర్తించామని, వీటిలో నూజివీడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47, చింతలపూడి ఎక్సైజ్ పరిధిలో 28, జంగారెడ్డిగూ డెం 24, పోలవరం 33, భీమడోలు 8 గ్రామాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత నెలలో సారా ఉన్న గ్రామాల్లో దాడులు నిర్వహించి 136 కేసులు నమోదు చేసి 96 మందిని అరెస్టు చేశామన్నారు. అదే విధంగా 46 వేల 570 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. 1,031 లీటర్ల సారా స్వాధీనం చేశామన్నారు. సారా రవాణాకు వినియోగించే 11 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామన్నారు. నాటు సారాలో పట్టుబడుతున్న పాత నేరస్తులపై బీఎన్‌ఎస్‌ఎస్ 129 కింద బైండోవర్ కేసులు నమోదు చేసి సంబంధిత తహసీల్దార్ వద్ద హాజరుపరుస్తున్నామని, ఇప్పటికే 175 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామ న్నారు. ఎవరైనా సారా కల్గి ఉన్న, విక్రయిం చినా, తయారు చేస్తున్న వారి సమాచారాన్ని 14405కు అధించాలని సూచిం చారు. నవోదయం 2.0 ప్రారంభం కాబోతు న్న సందర్భంలో పోలీసు అధికా రులతో కలిసి సంయుక్తంగా దాడులు చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాం తి పండుగ సందర్భంగా ప్రత్యేకప్రణాళిక రూపొందించామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక బృందాలు ఈనెల ఒకటి నుంచి ఏఏడో తేదీ వరకు దాడులు నిర్వహించి 26 సారా కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేసి 171 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 10,400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారన్నారు.