Share News

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:29 AM

ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ చెప్పారు.

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు
స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలిస్తున్న ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

కోటి 62 లక్షల రూపాయల విలువైన వెండి, బంగారు వస్తువులు స్వాధీనం

ఏలూరు క్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) :ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివ రాలను వెల్లడించారు. ఏలూరులోని ఇందిరమ్మ కాలనీ 7వ రోడ్డునకు చెందిన తేళ్ళ ఏసు (38) 2007 నుంచి 2016 మధ్య కాలంలో 18 దొంగ తనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి విడు దలయ్యాడు. 2016 నుంచి 2021 వరకు ఆటో డ్రైవర్‌గా జీవించాడు. ఆ తరువాత పేకాటలకు వెళ్తు అక్కడ ఏలూరునకు చెందిన గండిపూడి రాజ్‌కుమార్‌ అలియాస్‌ నాని (30), పెడపాడు మండలం మేడిపాడు గ్రామానికి చెందిన సాయి ల రాంబాబు(40), ఏలూరులోని వంగాయిగూ డెం గాంధీకాలనీకి చెందిన దాసరి బాలరాజు (25), ఏలూరులోని చిరంజీవి బస్టాంప్‌ సమీపంలో నివాసం ఉంటున్న భీముల ఏసు (36)లు పరిచయం అయ్యారు. వీరిని ఒక ముఠాగా తేళ్ళ ఏసు ఏర్పాటు చేసుకుని 43 ఇళ్ళల్లో పగటిపూట రెక్కీ చేసి రాత్రి పూట నేరాలకు పాల్పడ్డారు. మొత్తం కోటి 50 లక్షల విలువైన రెండు కేజీల బంగారు ఆభరణాలు, 12 లక్షల విలువైన 13 కేజీల వెండి వస్తువులను అపహరించారు. వీరు నూజివీడు సర్కిల్‌లో 11 నేరాలు, పెదవేగి సర్కిల్‌ పరిధిలో 11, ఏలూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 5, పోలవరం సబ్‌డివిజన్‌ పరిధిలో 1, కృష్ణాజిల్లాలో 12, తూర్పుగోదావరి జిల్లాలో 3 మొత్తం 43 నేరాలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి ఎవరికి చిక్కకుండా పరారీలో ఉన్నారు. ముసునూరు ఎస్‌ఐ ఎం చిరంజీవి, చాట్రాయి ఎస్‌ఐ రామకృష్ణ, నూజివీడు రూరల్‌ ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌, పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు వారి సిబ్బంది కలిసి గాలింపు చేపట్టారు. మొత్తం మీద ముసునూరు మండలం గుల్లపూడి గ్రామం అడ్డరోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఈ ముఠా చిక్కారు. వీరి నుంచి కోటి 62 లక్షల విలువైన రెండు కేజీల బంగారు వస్తువులు, 13 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 01 , 2025 | 12:29 AM