నేడు ఉండిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:42 AM
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్య టిస్తారు.
ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు
భీమవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఏర్పాట్ల పరిశీలన
ఉండి, జనవరి5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఉండిలో మంత్రి లోకేశ్ పర్య టించే ప్రాంతాలను జేసీ ఆదివారం పరిశీలిం చారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారం భించనున్న సీసీ రహదారి, పూర్వపు పాఠశాల భవనం, క్రీడాసౌకర్యాలు నిమిత్తం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి సూచ నలు అందించారు. గ్రామంలో రహదారుల పక్కన చెత్తచెదారం లేకుండా శానిటేషన్ చేసి బ్లీచింగ్ చల్లే విధంగా తగిన చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. మంత్రి లోకేశ్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ నయీం ఆద్నాన్ అస్మి తెలిపారు. ఆదివారం ఆయన డీఎస్పీ జయసూర్య, తహసీల్దారు నాగార్జునలతో కలిసి మంత్రి పర్యటించే ప్రాంతాలు పరిశీలించారు. అధికారులు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కాగా ప్రారంభోత్సవ శిలాఫలకాలను సుందరంగా తీర్చిదిద్దారు.
మంత్రి లోకేశ్ పర్యటన ఇలా...
ఉదయం 7.30 గంటలకు: ఉండవల్లిలోని తమ నివాసం నుంచి రోడ్డు మార్గంలో పయనం
10 గంటలకు: రోడ్డు మార్గంలో ఉండి జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణానికి చేరిక
ఉదయం 10.00 నుంచి 10.45 గంటల వరకు: పునర్నిర్మించిన 108 ఏళ్ల పాఠశాలకు
భవనం ప్రారంభం
ఉదయం 11–00 గంటలకు: రోడ్డు మార్గంలో కాళ్ల మండలం పెద అమిరం చేరిక
ఉదయం 11.00 –11.40 గంటల వరకు: దివంగత రతన్‌టాటా విగ్రహం ఆవిష్కరణ
ఉదయం 11.45: చినఅమిరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరిక
ఉదయం 11.45–12.30: విద్యార్థులతో సమావేశానికి హాజరు
మధ్యాహ్నం 12.40–2.30 గంటల వరకు: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
నివాసంలో కార్యకర్తలతో సమావేశం
మధ్యాహ్నం 2.45–4.00 : కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసం సందర్శన
సాయంత్రం 4.00: ఉండవల్లికి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం